...
...
Next Story

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

Published on: Oct 16, 2025, 12:26:52 IST
Advertisement

కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం క్షేత్రాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్నారు. తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు. ఆలయానికి వచ్చిన ప్రధానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రధాని మోదీ శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం కూడా చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలోనూ ప్రధాని పాల్గొన్నారు. దర్శనం తర్వాత ప్రధానికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మల్లన్న దర్శనం అనంతరం.. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. రాజ దర్బార్ గోడల మీద ఛత్రపతి శివాజీ చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా తిలకించారు. శివాజీ విగ్రహాన్ని నమస్కరించి కాసేపు పరిశీలించారు. శివాజీ దర్బార్‌ హాల్‌, ధ్యాన మందిరాలను చూశారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శనం చేసుకున్నారు. కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు అధికారులు. సున్నిపెంట దగ్గర సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతాను పర్యవేక్షిస్తున్నారు. మధ్యహ్నా 2:30 గంటలకు కర్నూలు బయల్దేరి వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks