పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయ్యాయి : మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టు మెుత్తం పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు.
పోలవరం పనుల పురోగతిని వైసీపీ పార్టీ కళ్లు ఉండి చూడలేనిదిగా తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఐదేళ్ళు అధికారం ఇస్తే 2 శాతం పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు, ఆపార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. 2014 -19 హాయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు72 శాతం పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి వివరించారు.
2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణ, శ్రద్ధతో ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువు కంటే ముందుగా అంటే 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తిచేయాలని చెప్పారు.
నాడు కేంద్రం రియంబర్స్ చేసిన 3,000 కోట్ల నిధులను మళ్లించేసి, పోలవరాన్ని ముంచేసిన ఘనుడు జగన్ అని మంత్రి నిమ్మల ఆరోపించారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రం వాల్ 1032 మీటర్లు, అంటే 83 శాతం నేటికీ పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరంలోనే నిర్వాసితులకు ఏడాదిలోనే 1894 కోట్లు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
'పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నాం. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. జనవరి మొదటి వారంలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారు. రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభిస్తారు. రాయలసీమలోని హంద్రీనీవా, ఉత్తరాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.' అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












