ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసు పరిధిలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గబ్బడ గ్రామం సమీపంలో దాదాపు 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు కోట్లలో ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శశి కుమార్ (52) తమిళనాడులోని తంజావూరు వాసి (ముఠా నాయకుడు), పాంగి సుబ్బారావు (21) అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా జి.మాడుగుల మండలం, వి. చంటిబాబు (27) అల్లూరి సీతారామరాజు జిల్లా, అమల్ రాజ్, మణికంఠన్ చంద్ర కుమార్ తమిళనాడు వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌కు బీజం 2024లో పడింది. 2024లో తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా జైలులో శశి కుమార్, చంటిబాబులకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారంలోకి దిగాలని ఇద్దరూ పథకం రచించారు.
జైలు నుంచి బయటకు వచ్చాక శశి కుమార్ సూచనల మేరకు చంటిబాబు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఏజెంట్లతో మాట్లాడాడు. ఆపై పాంగి సుబ్బారావు సహాయంతో ఒడిశా సరిహద్దుల్లోని జంతపాయి గ్రామం నుంచి 230 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.
సేకరించిన గంజాయిని జి.మాడుగుల మండలంలోని అలగామ గ్రామానికి తరలించి, అక్కడ రహస్యంగా నిల్వ ఉంచారు. తమిళనాడు నుంచి అమల్ రాజ్, మణికంఠన్‌లతో కలిసి శశి కుమార్ కారులో అల్లూరి జిల్లాకు చేరుకున్నాడు. అలగామలో నిల్వ ఉంచిన గంజాయి లోడ్‌ను కారులోకి ఎక్కించి, దానికి సెక్యూరిటీగా మరో రెండు పైలట్ వాహనాలలో కాకినాడ జిల్లా తుని వైపు ప్రయాణమయ్యారు.
ఈ గంజాయిని చెన్నై, కోయంబత్తూర్, తంజావూరు వంటి నగరాల్లో విక్రయించడమే కాకుండా, సముద్ర మార్గం గుండా శ్రీలంకకు తరలించి అక్కడ అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా రవాణా గురించిన పక్కా సమాచారంతో నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బడ గ్రామం వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కారుతో పాటు పైలట్ వాహనాలుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 230 కిలోల గంజాయి బయటపడింది. వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
{{/usCountry}}ఈ గంజాయిని చెన్నై, కోయంబత్తూర్, తంజావూరు వంటి నగరాల్లో విక్రయించడమే కాకుండా, సముద్ర మార్గం గుండా శ్రీలంకకు తరలించి అక్కడ అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా రవాణా గురించిన పక్కా సమాచారంతో నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బడ గ్రామం వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కారుతో పాటు పైలట్ వాహనాలుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 230 కిలోల గంజాయి బయటపడింది. వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ఈగిల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘాను తీవ్రం చేసింది. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు 14500 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.