Special Trains : అక్టోబర్ 9, 10 నుంచి సికింద్రాబాద్-కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్
Special Trains : అక్టోబర్ 9, 10 నుంచి సికింద్రాబాద్-కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. పండుగల వేళ ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయి.
పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (రైలు నంబరు: 07817)
ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 9న (శుక్రవారం) సాయంత్రం 07:25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు (శనివారం) ఉదయం 08:00 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (రైలు నంబరు: 07818)
తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 అక్టోబర్ 10న (శనివారం) రాత్రి 09:00 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 08:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
స్టాపేజీలు
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకునేందుకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.
క్వార్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ మా బమ్‌లేశ్వరి ఆలయాన్ని దర్శించుకునే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు నిమిషాల పాటు తాత్కాలిక నిలుపుదల కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తాత్కాలిక సదుపాయం 2026 అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్ – రాయ్‌పూర్ (రైలు నంబరు: 12771) ఆగే తేదీలు: అక్టోబర్ 12, 14, 16, 19. ఉదయం 10:46 గంటలకు వచ్చి, 10:48 గంటలకు బయలుదేరుతుంది.
రాయ్‌పూర్ – సికింద్రాబాద్ (రైలు నంబరు: 12772) అక్టోబర్ 13, 15, 17, 20. సాయంత్రం 06:30 గంటలకు వచ్చి, 06:32 గంటలకు బయలుదేరుతుంది.
బిలాస్‌పూర్ – చెన్నై (రైలు నంబరు: 12851) అక్టోబర్ 18, 2026 మధ్యాహ్నం 12:16 గంటలకు వచ్చి, 12:18 గంటలకు బయలుదేరుతుంది.
చెన్నై – బిలాస్‌పూర్ (రైలు నంబరు: 12852) అక్టోబర్ 19, 2026 ఉదయం 10:18 గంటలకు వచ్చి, 10:20 గంటలకు బయలుదేరుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


