తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి…. మొదట శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అంతకంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె కుటుంబ సభ్యులు, పరివారంతో కలిసి రాష్ట్రపతి ప్రార్థనలు చేశారు. పూజారులతో కలిసి రాష్ట్రపతి మహా ద్వారంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్ద ప్రార్థనలు చేశారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ముకు తీర్థ ప్రసాదం, వేంకటేశ్వర స్వామి చిత్రపటం, టీటీడీ ప్రచురించిన 2026 డైరీలు, క్యాలెండర్లను అందజేశారు. తిరుపతి జిల్లా తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి ఆలయాన్ని కూడా గురువారం సాయంత్రం సందర్శించారు.
హైదరాబాద్ కు రాక:
ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు,అధికారులు స్వాగతం పలుకుతారు.
ఆ తర్వాత రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళామహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభిస్తారు. తిరిగి శనివారం ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు.