...
...
Next Story

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Published on: Aug 1, 2026, 11:52:25 IST
Advertisement

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు.

భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ ప్రారంభం
భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ ప్రారంభం

ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం నూతన టెర్మినల్ భవనంలో కలియతిరిగిన ప్రధాని మోదీ, ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. చెక్-ఇన్ హాల్స్, ఎయిర్‌పోర్ట్ విశిష్ట డిజైన్, వాడిన వినూత్న సాంకేతికతల గురించి జీఎమ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి సమగ్రంగా వివరించారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ, ఏవియేషన్ హబ్ మోడళ్లను ప్రధాని ఆసక్తిగా తిలకించారు.

విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మెుత్తం 13,750 మంది ఈ నృత్యం చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు థిసా నృత్యంలో పాల్గొన్నారు. టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్‌ జీపులో వెళ్తూ నృత్యాన్ని తిలకించారు.

ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి ఊతమిచ్చే రూ.17,912 కోట్ల విలువైన పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks