బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన, ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు..!

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు  మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏపీలో ఓవైపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా…. మరోవైపు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.

Published on: Jul 15, 2026, 18:57:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో రాగల ఐదు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలైన ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలలో ఇవాళ ఉదయం ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.

ఏపీలో వర్షసూచన
ఏపీలో వర్షసూచన

దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడి… బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది.

ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి జమ్మూ, డెహ్రాడూన్, పాట్నా మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉంది. ఏపీ వైపు దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్నిచోట్ల వడగాలుతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

ఏపీ వెదర్ రిపోర్ట్ - అంచనాలు :

ఉత్తర కోస్తాంధ్ర - యానాం : ఇవాళ (జూలై 15): తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే వీలుంది.

  • రేపు (జూలై 16): కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుంది.
  • ఎల్లుండి (జూలై 17): కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా… గాలి వేగం అదే స్థాయిలో కొనసాగుతుంది. వాతావరణంలో వేడి, తేమ పెరిగి ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది.

దక్షిణ కోస్తాంధ్ర : ఈరోజు (జూలై 15): పొడి వాతావరణం ఉంటుంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఒకటి రెండు చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

  • రేపు (జూలై 16): ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
  • ఎల్లుండి (జూలై 17): తేలికపాటి జల్లులు కురుస్తాయి. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం ఉంటుంది.

రాయలసీమ: ఈరోజు (జూలై 15): పొడి వాతావరణం ఉంటుంది. బలమైన గాలులతో పాటు ఒకటి రెండు చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

  • రేపు (జూలై 16): ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చు. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, వడగాల్పుల తీవ్రత ఉంటుంది.
  • ఎల్లుండి (జూలై 17): తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 30-40 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ… ఉక్కపోత తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More