Andhra Pradesh Weather Report : ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో, ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ మరియు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. అంతేకాకుండా దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
నిన్నటి రోజున ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం నుండి ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు ఉత్తర తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు (సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో) విస్తరించిన ద్రోణి ఈరోజు తక్కువగా (బలహీనపడి) గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ దిశల నుండి గాలులు వీస్తున్నాయి.
తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గాలులు వీచే సూచనలున్నాయి.
ఉత్తర, దక్షిణ కోస్తా :
- ఇవాళ కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
- రేపు మరియు ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతం:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ పరిధిలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ పరిధిలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}మరోవైపు ఇవాళ ఉదయం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని కాకినాడ, పోలవరంలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ఉదయం పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడల్లో వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.