Weather Update : వాతావరణం అప్డేట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు!
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా మారింది. గురువారం (జూలై 16) రాష్ట్రంలోని మధ్య ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ, ఉక్కపోత, వడగాల్పుల వంటి పరిస్థితులు కొనసాగినప్పటికీ.. కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అమరావతి వాతావరణ కేంద్రం పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది.

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక బలమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే రెండు రోజుల్లో వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ గంగ మైదాన ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఈ అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురంలో పడనున్నాయి.
ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 23 వరకు వాతావరణ సూచన (వీక్లీ ఫోర్‌కాస్ట్) ఐఎండీ ప్రకారం చూసుకుంటే.. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో జూలై 19 వరకు కొన్ని చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అయితే జులై 20 నుంచి జులై 23 మధ్య ఈ రెండు ప్రాంతాలలో వర్షాల ప్రభావం తగ్గుతుంది. కానీ బలమైన గాలులు వీస్తూనే ఉంటాయి. ఇక రాయలసీమ ప్రాంతంలో ఈ వారం అంతగా వర్షాలు కురిసే అవకాశం లేదు.
గురువారం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి:
కృష్ణా జిల్లా భవదేవరపల్లి: 49.25 మి.మీ (అత్యధికం)
కృష్ణా జిల్లా నాగాయలంక: 44 మి.మీ
పల్నాడు జిల్లా సావల్యాపురం: 25.19 మి.మీ
బాపట్ల జిల్లా కూచినపూడి: 23.5 మి.మీ
అనంతపురం జిల్లా విరూపాపురం: 23 మి.మీ
రాష్ట్రంలోని మిగిలిన కొన్ని ప్రాంతాల్లో 20 మి.మీ కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది.
తెలంగాణలోనూ వాతావరణం మారిపోయింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో వాతావరణ కాస్త మారింది. ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


