దివంగత మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు స్మారకార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా ఆయన జయంతిని ‘రాష్ట్ర పండుగ’గా అధికారికంగా నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు - 2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా, సీఎం చంద్రబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో అమిత్ షా, చంద్రబాబులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పాత్రికేయ, సినీ రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకున్నారు.
సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడు: కేంద్ర మంత్రి అమిత్ షా
రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన సంస్థల ద్వారా అందుతున్న సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన తనను రామోజీరావు తన కారులో వేదిక వద్దకు తీసుకెళ్లారని, అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని అమిత్ షా గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత నాలుగుసార్లు కలిసిన ప్రతిసారీ ప్రపంచ విషయాలపై ఆయనకున్న అవగాహన, సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపే తీరు చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎలాంటి వారసత్వ ఆస్తులు, జర్నలిజం డిగ్రీ లేకపోయినా కేవలం కఠోర శ్రమ, దార్శనికతతో ఎదిగారని ప్రశంసించారు అమిత్ షా. నిత్యం తెలుగు ప్రజలకు సత్యాన్ని అందించే విషయంలో ఆయన్ను దిగ్గజ పాత్రికేయులు రామ్‌నాథ్ గోయెంకాతోనే పోల్చగలమని అన్నారు. 24 గంటల ప్రాంతీయ వార్తా ఛానళ్లను ప్రారంభించి దేశంలోని ఇతర భాషా ఛానళ్లకు గౌరవం తెచ్చారని పేర్కొన్నారు.
ఇక సినిమా రంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని, చేతిలో కథ, కళాకారులు, డబ్బు ఉంటే చాలు అక్కడికి వెళ్లి పూర్తి సినిమా నిర్మించుకుని రావచ్చని ఓ గుజరాతీ నిర్మాత తనతో అన్న మాటలను అమిత్ షా ప్రస్తావించారు. విలువల కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు.
కూర్చున్న చోటే ఓ విశ్వవిద్యాలయం: సీఎం చంద్రబాబు
{{/usCountry}}ఇక సినిమా రంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని, చేతిలో కథ, కళాకారులు, డబ్బు ఉంటే చాలు అక్కడికి వెళ్లి పూర్తి సినిమా నిర్మించుకుని రావచ్చని ఓ గుజరాతీ నిర్మాత తనతో అన్న మాటలను అమిత్ షా ప్రస్తావించారు. విలువల కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు.
కూర్చున్న చోటే ఓ విశ్వవిద్యాలయం: సీఎం చంద్రబాబు
{{/usCountry}}1980 నుంచి నాలుగున్నర దశాబ్దాల పాటు రామోజీరావుతో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు భావోద్వేగంతో పంచుకున్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రామోజీరావు అన్న మాటలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని, సాధారణ వ్యక్తులలోని ప్రతిభను వెలికితీసి అసాధారణ వ్యక్తులుగా మలిచిన శిల్పి అని చంద్రబాబు అభివర్ణించారు. ఆయన ఎక్కడికీ వెళ్లకపోయినా, కూర్చున్న చోటే ఒక విశ్వవిద్యాలయంలా అధ్యయనం చేసేవారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి అత్యవసరమైన బలమైన నాయకుడని రామోజీరావు తనతో ఎన్నోసార్లు చెప్పేవారని చంద్రబాబు వెల్లడించారు.
గతేడాది రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక, రెండో ఏడాది విజయవాడలో జరిగిందని, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాలని చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, యూత్ ఐకాన్, విద్య, వైద్యం-ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన 9 మంది ప్రతిభావంతులకు ఈ సందర్భంగా 'రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల'ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్, కుటుంబ సభ్యులను అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.