తీవ్ర తుపానుతో భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై చంద్రబాబు సమీక్ష

cyclone akvan updates : 20 తేదీన కోస్తాంధ్రను అక్వాన్ తీవ్ర తుపాను తాకనుంది. దీంతో ఐఎండీ కోస్తాంధ్ర తీరానికి భారీ వర్ష సూచన ఉందని హచ్చరించింది. ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Published on: Nov 16, 2026, 18:30:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

తుపాను ముందస్తు జాగ్రత్తలపై చంద్రబాబు సమీక్ష
తుపాను ముందస్తు జాగ్రత్తలపై చంద్రబాబు సమీక్ష

కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

రానున్న తుపాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతోపాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ఆక్వాన్‌ తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం

అక్వాన్‌ తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. తుపాను ప్రభావంతో విద్యుత్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపీఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంభవించిన తుపాన్ల సమయంలో ఎదురైన పరిస్థితులు, విద్యుత్‌ పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఎక్కడైనా విద్యుత్‌ స్తంభాలు నేలకూలినా, తీగలు తెగిపడినా వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు మంత్రి గొట్టిపాటి. ఇందుకోసం అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని, తుపాను సమయంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా తెగిపడిన విద్యుత్‌ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు ఉంటే వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. సరఫరా నిలిచిన ప్రాంతాలు, పునరుద్ధరణకు పట్టే సమయం తదితర వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గొట్టిపాటి రవికుమార్‌ అధికారులకు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More