డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా..? సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్!
ఏపీపీఎస్సీ, డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నియామకాల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు.

డీఎస్సీలో అక్రమాలు - వైఎస్ జగన్
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్… డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తన తప్పులను ఒప్పుకోవడానికి నిరాకరిస్తూ… ప్రశ్నించిన ప్రతిసారీ ఆత్మరక్షణలో పడుతోందని ధ్వజమెత్తారు.
శాసనసభలో ఈ అంశంపై చర్చించేందుకు ఉత్సాహం చూపిన కూటమి ప్రభుత్వం… అసలు నిజాలు బయటపడతాయనే భయంతో శాసనమండలిలో మాత్రం విస్తృత చర్చకు దూరంగా పారిపోతోందని జగన్ ఆరోపించారు. మండలిలో ప్రతిపక్ష సభ్యులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకంజ వేస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఖరిని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. డీఎస్సీ ప్రశ్నపత్రం తయారు చేయడం, అదే అధికారికి పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగించడంలో తప్పేమీ లేదనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఏపీ డీఎస్సీ నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించిన దాఖలాలు లేవు. ప్రశ్నాపత్రం తయారు చేసేవారే పరీక్షను నిర్వహిస్తే, వ్యవస్థలోని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దెబ్బతింటాయి. అక్రమాలకు పునాది పడింది ఇక్కడే," అని జగన్ స్పష్టం చేశారు.
ఆ పేరు ఎలా తొలగించారు..?
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలో భాగస్వామిగా ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ వ్యవహారాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. తొలి మెరిట్ జాబితాలో నవీన్ మొదటి ర్యాంకు సాధించినట్లు స్వయంగా చంద్రబాబు, లోకేష్ శాసనసభలో అంగీకరించారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆ తర్వాత అతని పేరును మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు..? రెండో మెరిట్ జాబితాను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"మొదటి మెరిట్ జాబితాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు కాల్ లెటర్ ఇవ్వకపోతే, అతడు సర్టిఫికేట్ల పరిశీలనకు ఎలా హాజరు కాగలిగాడు?" అని జగన్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
క్రీడా కోటా (స్పోర్ట్స్ కోటా) కింద జరిగిన నియామకాలు, జారీ చేసిన సర్టిఫికేట్లపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనేందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు కూడా బయటకు వచ్చాయని ప్రస్తావించారు.
“ఏపీపీఎస్సీ గ్రూప్-1 పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది.. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి.. తప్పు చేశారు అని క్లియర్ కట్‌గా ఉన్నా, సీబీఐ విచారణకు ఒప్పుకోవడం లేదు.. డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం.. మేం పోరాడుతున్న అంశాలు వాస్తవమే అని ప్రభుత్వం అంగీకరించింది.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐ ఎంక్వైరీ వేయాలి.. డీఎస్సీలో అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం” అని వైఎస్ జగన్ తెలిపారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన ఈ వ్యవహారమంతటిపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కోరారు. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందని వివరించారు. ఇప్పటికే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోరుతూ ఆగస్టు 17న ఏపీ శాసనమండలి ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

