శ్రీ సత్యసాయి జిల్లాలో 129 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
శ్రీసత్యసాయి జిల్లాలో 129 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 17వ తేదీలోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత విభాగం శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని పుట్టపర్తి, ఓబులదేవ చెరువ, నల్లచెరువు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 129 పోస్టులను భర్తీ చేయనున్నారు.

- ఓబులదేవ చెరువు ప్రాజెక్ట్: 95 పోస్టులు
- పుట్టపర్తి ప్రాజెక్ట్: 33 పోస్టులు
- నల్లచెరువు ప్రాజెక్ట్: 1 పోస్టు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పాస్ అయి ఉంటే టీసీ లేదా స్టడీ సర్టిఫికెట్ జతపరచడం తప్పనిసరి. 01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితులై ఉండాలి. సదరు అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక నివాసి అయి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో సిడిపిఓ నిర్వహించే తెలుగు డిక్టేషన్ పరీక్షలో అభ్యర్థులు తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది.
ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 11,500, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ. 7,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. కేంద్రాల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులలో అంధత్వం, వినికిడి లోపం, ఆటిజం, మేధో వైకల్యం ఉన్నవారికి కొన్ని రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వేషన్ల మినహాయింపులు ఉంటాయి.
అర్హులైన మహిళా అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మా దరఖాస్తులను ఓబులదేవ చెరువు, పుట్టపర్తి, నల్లచెరువు ప్రాజెక్టు కార్యాలయాల నుండి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను తిరిగి సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలోనే 17-07-2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించి రశీదు పొందాలి.
దరఖాస్తుతో పాటు తహశీల్దార్ జారీ చేసిన కుల, నివాస ధృవీకరణ పత్రాలు, 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డ్, వికలాంగత్వ పత్రం (వర్తిస్తే), ఇటీవల తీసిన ఫోటోపై సంతకం చేసి గెజిటెడ్ అధికారితో ధృవీకరించి (అటెస్టెడ్) జతపరచాలి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://srisathyasai.ap.gov.in/ ను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


