...
...
Next Story

శనగ రైతులకు ఊరట... కేంద్రం అనుమతితో కొనుగోళ్లు పెంపు

Bengal Gram : రాష్ట్రంలోని అన్నదాతల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనగ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పిందన్నారు.

Published on: Apr 19, 2026, 12:51:46 IST
Advertisement

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని శనగ, మొక్కజొన్న రైతుల పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది శనగ సాగు పెరిగి 7.13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిన నేపథ్యంలో, ఇప్పటికే 94,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని కోరారు.

మరిన్ని శనగలు సేకరించనున్న కేంద్రం
మరిన్ని శనగలు సేకరించనున్న కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలుకు తక్షణమే అనుమతి ఇచ్చారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

మిరప, పొగాకు రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టడం వల్ల ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగాయని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద మొక్కజొన్నను సేకరించనప్పటికీ, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సేకరణ చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

'​అలాగే మొక్కజొన్న రైతుల సమస్యలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. క్రాప్ డైవర్షన్ వల్ల మొక్కజొన్న సాగు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ధరలు తగ్గి రైతులకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. పీడీఎస్ స్కీంలో లేకపోయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాను.' అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఈ అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, లాభదాయకమైన ధరలు, తగినంత మార్కెట్ మద్దతు లభించేలా కేంద్రంతో సమన్వయంతో అన్ని ప్రయత్నాలు చేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe