Supreme Court : క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు - సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మత మార్పిడులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను కోల్పోతారని స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
మతం మార్పిడి విషయంలో ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని నొక్కి చెప్పింది. ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ కీలక తీర్పును మంగళవారం వెలువరించింది.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ… కీలక అంశాలను ప్రస్తావించింది. హిందూ, సిక్కు మతం లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎస్సీ సభ్యులకు అందుబాటులో ఉన్న రాజ్యాంగ రక్షణలను క్లెయిమ్ చేయలేరని పేర్కొంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మతం మార్చుకుని మరొక మతాన్ని చురుకుగా ఆచరించినప్పుడు…. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధకత) చట్టం కింద రక్షణతో సహా ఎస్సీ గుర్తింపుతో ముడిపడి ఉన్న ఏ చట్టపరమైన అర్హతలు వర్తించవని స్పష్టం చేసింది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ప్రకారం…. ఎస్సీ హోదా నిర్దిష్ట మతాలకు పరిమితం చేస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
ఏపీ హైకోర్టు తీర్పు - సమర్థించిన సుప్రీంకోర్టు
గుంటూరు జిల్లాలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆయన ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వీరిపై అట్రాసిటీ చట్టం కింద ఆనంద్… 2021లో కేసు పెట్టారు. ఈ కేసును సవాల్ చేస్తూ… వారంతా హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్‌గా పనిచేస్తుండటంతో క్రైస్తవుడవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని గుర్తు చేస్తూ…. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులే ఎస్సీలు అవుతారని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 30, 2025వ తేదీన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్… సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

