Sanjeevani Project : అల్లూరి జిల్లాలో ఆగస్టు 22న సంజీవని పైలట్ ప్రాజెక్ట్ లాంచ్!
Sanjeevani Project : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 22న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 22వ తేదీన ఈ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన సంజీవని పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
చంద్రబాబు
ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రాక సందర్భంగా చేపట్టాల్సిన వివిధ రకాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
{{^htLoading}} {{/htLoading}}
ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) ఆదిత్య వర్మ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) శ్రుతి, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఎం.వి.ఎస్. లోకేశ్వరరావుతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నిర్వహించే సభలు, ప్రదేశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సీఎం పర్యటనకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు, పబ్లిక్ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండ తీవ్రత లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా సభా ప్రాంగణం వద్ద తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు (మెడికల్ క్యాంపులు) అందుబాటులో ఉంచాలి.
ప్రభుత్వం వైపు నుంచి భద్రత, ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. వీఐపీ సెక్యూరిటీ, హెలిప్యాడ్ నిర్మాణం, సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాలు, సభా ప్రాంగణం వద్ద ప్రజల గ్యాలరీల నిర్వహణ, పబ్లిక్ ఎంట్రీల పర్యవేక్షణ వంటి ఏర్పాట్లను లోప రహితంగా సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.