జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు - ఈసారి ఎన్ని రోజులంటే..?
ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10 నుంచి జనవరి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు పండుగ సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు మూసివేయనున్నారు.
సంక్రాంతి వస్తుందంటే చాలు సెలవుల కోసం బడి పిల్లలు ఎదురూచూస్తుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సొంత ఊర్లకి పయనమవుతారు. సరదాగా వారంరోజుల పాటు బంధువులు, గ్రామస్థులతో సంతోషంగా గడుపుతుంటారు. అయితే ప్రభుత్వం ప్రకటించే సెలవులను చూసుకునే…. వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈసారి కూడా సంక్రాంతి పండగకి ఎక్కువగానే సెలవులు ఉండనున్నాయి.

ఈసారి 9 రోజులు…!
ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ఉండున్నాయి. జనవరి 18 వరకు అంటే మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత అంటే జనవరి 19వ తేదీ బడులన్నీ తిరిగి తెరుచుకుంటాయి.
ప్రతి ఏటా ఉండే విధంగానే ఈసారి కూడా పండుగ ముందు రోజునే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే సెలవులు ముగిసిన వెంటనే జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్రాంతి పండుగ గొప్ప అవకాశం. ఉద్యోగాలతో సిటీల్లో ఉండేవారు, చదువు కోసం హాస్టళ్లలో ఉండేవారు.. సరిగా ప్లాన్ చేసుకంటే ఊర్లో ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

