ఏపీ, తెలంగాణ సంక్రాంతి సెలవులు.. ఇలా ప్లాన్ చేస్తే 9 రోజులు లాంగ్ బ్రేక్
ఈసారి మకర సంక్రాంతికి ఏపీ, తెలంగాణలో సెలవులు ఎక్కువగా ప్లాన్ చేయవచ్చు. కేవలం మధ్యలో రెండు రోజులు లీవ్ తీసుకుంటే 9 రోజులు కలిసి వస్తాయి.
మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్రాంతి పండుగ గొప్ప అవకాశం. ఉద్యోగాలతో సిటీల్లో ఉండేవారు, చదువు కోసం హాస్టళ్లలో ఉండేవారు.. సరిగా ప్లాన్ చేసుకంటే ఊర్లో ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకోసం 2026 సంక్రాంతి పండుగకు సరిగా మీరు ప్రణాళికలు వేసుకోవాలి.

ఈసారి సంక్రాంతికి జనవరి 10 నుండి 18, 2026 వరకు 9 రోజులు ప్లాన్ చేయవచ్చు. సాధారణంగా సంక్రాంతికి కేవలం రెండు సెలవులు మాత్రమే వస్తాయి. కానీ ఈసారి మీరు ప్లాన్ చేసుకుంటే 9 రోజుల అద్భుతమైన బ్రేక్ తీసుకోవచ్చు. అలా మీకు కలిసి వస్తాయి హాలీడేస్. ప్రియమైనవారితో సమయం గడపడం, పండుగ విందులు ఆస్వాదించడం, కొత్త సంవతర్సం మెుదట్లోనే.. రీఛార్జ్ చేసుకోవచ్చు.
జనవరి 10 (శనివారం) - రెండో శనివారం సెలవు
జనవరి 11 (ఆదివారం) - వారాంతం
జనవరి 12-13 (సోమవారం-మంగళవారం) - రెండు సెలవులు తీసుకోండి.
జనవరి 14 (బుధవారం) - భోగి
జనవరి 15 (గురువారం) - సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం) - కనుమ (ఏపీ సెలవు, తెలంగాణ ఆప్షనల్)
జనవరి 17 (శనివారం) - షబ్-ఎ-మేరాజ్ (తెలంగాణ ఆప్షనల్)
జనవరి 18 (ఆదివారం) - వారాంతం
మీరు ప్లాన్ చేసుకుంటే 2 సెలవులు మాత్రమే అవసరం. జనవరి 12, 13 తేదీలకు సెలవులు తీసుకోవాలి. జనవరి 19న తిరిగి పనిలోకి వెళ్లవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


