సంక్రాంతి పండుగకు ఏపీ, తెలంగాణ మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ సీజన్ కారణంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాలకు అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలను చూద్దాం..

Updated on: Dec 25, 2025, 06:40:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ, వికారాబాద్, నాందేడ్, మచిలీపట్నం మధ్య రైళ్లు నడుస్తాయి. విజయవాడ, సికింద్రాబాద్, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లలో కూడా ఆగుతాయి. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రైలు నెం. 07450 కాకినాడ టౌన్ - వికారాబాద్ జనవరి 19న సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం. 07451 వికారాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ - వికారాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్‌లు.. సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

రైలు నెం.07452 నాందేడ్ - కాకినాడ టౌన్ జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం.07453 కాకినాడ టౌన్ - నాందేడ్ జనవరి 13న మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.

నాందేడ్ - కాకినాడ టౌన్ - నాందేడ్ ప్రత్యేక రైళ్లు.. ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోలారం, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి రెండు స్టేషన్లలో ఆగుతాయి.

మచిలీపట్నం-వికారాబాద్ మధ్య రైలు నెంబర్ 07454 జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 07455 వికారాబాద్-మచిలీపట్నం రైలు జనవరి 11, 18 తేదీల్లో రాత్రి పది గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుకుంటుంది.

మచిలీపట్నం-వికారాబాద్-మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.

క్రిస్‌మస్, న్యూ ఇయర్ స్పెషల్ రైళ్లు

క్రిస్‌మస్, న్యూ ఇయర్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్-ముంబయి మధ్య రైలు నెంబర్ 07458 డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం 5.30కి బయల్దేరి.. మరిసటి రోజు ఉదయం 10.40కి ముంబయికి చేరుకుంటుంది. ముంబయి నుంచి 07459 రైలు డిసెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 3.20కి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్బూర్గి, సోలాపూర్, పూణే, కల్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటే మంచిది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More