...
...
Next Story

కొత్తూరు తాడేపల్లి శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

కొత్తూరు తాడేపల్లి శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు.

Published on: Oct 7, 2026, 11:13:30 IST
Advertisement

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని ప్రముఖ శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనున్నట్లు ఆలయ భక్తమండలి సభ్యులు ప్రకటనలో వెల్లడించారు.

శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి
శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం నుంచి విజయదశమి రోజు వరకు పది రోజుల పాటు అమ్మవారికి విభిన్న రూపాల్లో విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఉదయం 08:00 గంటలకు శ్రీ దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, ఉదయకాల పూజలతో రోజువారీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ఉదయం 10:00 గంటలకు లోకకళ్యాణార్థం, భక్తుల క్షేమం కోసం అత్యంత శక్తివంతమైన చండీ సప్తశతి హోమం నిర్వహిస్తారు.

ఉదయం 11:00 గంటలకు శ్రీ లలితా దేవికి మహిళలచే పూర్ణాహుతి, విశేష కుంకుమార్చన జరుగుతుంది.

ఉదయం 11:30 గంటలకు మహా నీరాజనం, మంత్రపుష్పం సమర్పణ అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ ఉంటుంది.

సాయంత్రం 06:30 గంటలకు ఆలయ ప్రాంగణంలో భక్తులందరిచే సమాజ శ్రేయస్సు కోసం సమూహ లలితా సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశారు.

రాత్రి 07:30 గంటలకు రాత్రి పూజల అనంతరం మహా నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల పంపిణీతో ఆనాటి పూజలు ముగుస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks