Young advocate custody Incident : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం…… దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)గా నమోదు చేసింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ఈ కేసు మే 15వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అసలేం జరిగింది?

మే 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ధర్మాసనం ముందు ఒక కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఒక యువ న్యాయవాది ఒక నిర్దిష్ట ఉత్తర్వు కాపీని సమర్పించలేకపోయారు. ఈ చిన్న సాంకేతిక లోపానికి ఆగ్రహించిన న్యాయమూర్తి…. ఆ న్యాయవాదిని 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిణామం న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఖండించిన బార్ అసోసియేషన్
ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మే 6వ తేదీన ఎస్సీబీఏ (SCBA) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. "న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటంతో పాటు, బెంచ్ మరియు బార్ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్‌ను అసోసియేషన్ కోరింది.
{{/usCountry}}ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మే 6వ తేదీన ఎస్సీబీఏ (SCBA) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. "న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటంతో పాటు, బెంచ్ మరియు బార్ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్‌ను అసోసియేషన్ కోరింది.
{{/usCountry}}"న్యాయమూర్తుల శక్తి సామర్థ్యాలు భయం పుట్టించడంలో కాదు, ఓర్పు ప్రదర్శించడంలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా వృత్తిని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న యువ న్యాయవాదుల పట్ల సహనం వహించాలి," అని అసోసియేషన్ తన తీర్మానంలో పేర్కొంది. యువ న్యాయవాదులను భయపెట్టడం లేదా అవమానించడం వల్ల న్యాయవాద వృత్తి స్వేచ్ఛ దెబ్బతింటుందని….. ఇది మొత్తం న్యాయ వితరణ వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది.
బీసీఐ జోక్యం….
న్యాయవాదుల చట్టబద్ధమైన సంస్థ అయిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంలో సీజేఐ జోక్యాన్ని కోరింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోను ప్రస్తావిస్తూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. "సదరు న్యాయవాది తన శారీరక ఇబ్బందులను వివరిస్తూ… పదేపదే క్షమించమని వేడుకున్నా న్యాయమూర్తి కనికరించలేదు" అని ఆయన లేఖలో వివరించారు.
కోర్టు హాల్ లో న్యాయవాది అనుభవాన్ని ఎగతాళి చేస్తూ…. రిజిస్ట్రార్ మరియు పోలీసులను పిలిపించి కస్టడీకి పంపడం అసంబద్ధమని బీసీఐ పేర్కొంది. న్యాయాధికారాలను చలాయించేటప్పుడు సంయమనం, మానవత్వం మరియు నిష్పాక్షికత ఉండాలని బీసీఐ గుర్తు చేసింది.
మే 15న కీలక విచారణ
అడ్వకేట్లు కోర్టులో అధికారులని…. వారి గౌరవానికి భంగం కలగకూడదని న్యాయ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పిల్ (PIL)గా స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు తీసుకున్న చర్యల రికార్డులను పరిశీలించి…. తగిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు. మే 15న జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.