వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా పలు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయవచ్చు. సీజనల్ రష్‌ను నిర్వహించేందుకు అదనపు స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఏయే రూట్లలో

చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి-చర్లపల్లి, నాందెడ్-తిరుచానూరు, చర్లపల్లి,-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసాపూర్, నాందెడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్-మైసూర్, చర్లపల్లి-భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి. ఈ ట్రైన్లు రెండు వైపులా ఉన్నాయి.
మరోవైపు కొన్ని రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
- రైలు నెం. 06557 (SMVT బెంగళూరు – సంత్రాగాచి) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 24 వరకు శుక్రవారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06558 (శాంత్రగాచి – బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06207 (బెంగళూరు కంటోన్మెంట్ – కలబురగి) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 25 వరకు శనివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06208 (కలబురగి – బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06539 (SMVT బెంగళూరు – బీదర్) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు మరియు ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 26 వరకు శుక్రవారాలు, ఆదివారాలలో (6 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06540 (బీదర్ – SMVT బెంగళూరు) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 13 వరకు, ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 27 వరకు శనివారాలు, సోమవారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది.
వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు కనెక్టివిటీని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
{{/usCountry}}వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు కనెక్టివిటీని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
{{/usCountry}}