...
...
Next Story

ఏపీ నుంచి అరుణాచలం వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై రెగ్యులర్ రైలు.. బెంగళూరుకు కూడా!

ఏపీ నుంచి తమిళనాడులోని అరుణాచలం, కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్. ఇప్పటిదాకా ఈ రూట్లకు నడిచిన స్పెషల్ రైళ్లు.. ఇక మీద రెగ్యులర్ సర్వీసులుగా మారుతున్నాయి.

Published on: May 21, 2026, 10:08:38 IST
Advertisement

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పరిసర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు కీలక సర్వీసులను ఇకపై శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ రైళ్లుగా నడపనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో వెల్లడించారు.

రెగ్యులర్ కానున్న రైళ్లు

  • నరసాపురం - తిరువణ్ణామలై (అరుణాచలం)
  • నరసాపురం - బెంగళూరు (మల్లేశ్వరం/యశ్వంతపూర్ మార్గం)

అరుణాచలం
అరుణాచలం

ఇప్పటివరకు ఈ రెండు రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడపడం వల్ల ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడేది. ఈ నిర్ణయంతో ఇకపై సాధారణ రైలు ఛార్జీలతోనే ప్రయాణించే అవకాశం కలగనుంది.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి (తిరువణ్ణామలై) వెళ్లే శివభక్తులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రతి నెల పౌర్ణమి గిరిప్రదక్షిణ కోసం గోదావరి జిల్లాల నుండి వేలాది మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. ఇప్పుడు డైరెక్ట్ రెగ్యులర్ ట్రైన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభతరం కానుంది.

నరసాపురం, భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాల నుండి బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ బెంగళూరు రెగ్యులర్ సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా వారాంతాల్లో సొంతూళ్లకు వచ్చే వారికి టికెట్ల లభ్యత పెరగనుంది.

ఈ రెండు రైళ్లకు సంబంధించిన రైలు నంబర్లు, ఏ రోజుల్లో నడుస్తాయనే అధికారిక షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే (SCR) త్వరలోనే విడుదల చేయనుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకున్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

గుంటూరు-తిరుచిరాపల్లి

ఈ పొడిగింపు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నంద్యాల, కడప మీదుగా ప్రయాణించే ఈ రైలు ద్వారా భక్తులు ఇప్పుడు ఒకే ప్రయాణంలో పలు ప్రధాన క్షేత్రాలను దర్శించుకోవచ్చు. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, శ్రీరంగం వెళ్లవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks