...
...
Next Story

ఏపీ ప్రయాణికులకు అప్డేట్... విజయవాడ - పలాస మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లు! వయా రాజమండ్రి

Vijayawada Palasa Special Trains : వారాంతంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ, పలాస మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు అక్టోబరు 3, 4 తేదీల్లో చెరో రెండు సర్వీసులు అందించనున్నాయి.

Published on: Oct 3, 2026, 12:58:24 IST
Advertisement

Vijayawada Palasa Special Trains : వారాంతాల్లో రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేయడానికి, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి పలాస మధ్య దువ్వాడ మీదుగా ప్రత్యేక జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబరు 3, 4 తేదీలలో (శని, ఆదివారాల్లో) రెండు వైపులా చెరో రెండు సర్వీసుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

టైమింగ్స్ వివరాలు….

  • విజయవాడ - పలాస స్పెషల్ (రైలు సంఖ్య: 07452): ఈ రైలు అక్టోబరు 3, 4 తేదీల్లో ఉదయం 07:30 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 14:00 గంటలకు దువ్వాడ చేరుకుని….. అక్కడి నుంచి 14:02 గంటలకు పలాస వైపు పయనమవుతుంది. అదే రోజు సాయంత్రం 18:00 గంటలకు పలాస చేరుకుంటుంది.
  • పలాస - విజయవాడ స్పెషల్ (రైలు సంఖ్య: 07451): తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబరు 3, 4 తేదీల్లో సాయంత్రం 18:45 గంటలకు పలాసలో బయలుదేరుతుంది. రాత్రి 22:15 గంటలకు దువ్వాడ చేరుకుని, 22:17 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లు!
విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లు!

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యలో నూజివీడు , ఏలూరు , తాడేపల్లిగూడెం, రాజమండ్రి , అనపర్తి , సామర్లకోట, అన్నవరం , తుని, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చిపురుపల్లి, పొందురు, శ్రీకాకుళం రోడ్, కోటబొమ్మాళి, నౌపడ స్టేషన్లలో ఆగుతాయి.

సాధారణ ప్రయాణికులు, చివరి నిమిషంలో ప్రయాణాలు పెట్టుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రైలులోని అన్ని కోచ్‌లను అన్‌రిజర్వ్‌డ్విభాగంలోనే కేటాయించారు. ఈ రైలులో మొత్తం 10 సాధారణ ద్వితీయ శ్రేణి కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ లేకపోయినా కౌంటర్‌లో సాధారణ టికెట్ తీసుకుని ప్రయాణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks