Tirupati Rajahmundry Flights : తిరుపతి టు రాజమండ్రి - ‘ఫ్లై91’ విమాన సేవలు ప్రారంభం
Fly91 Tirupati Rajahmundry Flights : తిరుపతి నుంచి రాజమండ్రికి ఫ్లై91 విమాన సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుపతి-విజయవాడ సర్వీసును ప్రారంభించిన మరుసటి రోజే… ఈ కొత్త మార్గంలో విమాన రాకపోకలు షురూ అయ్యాయి.
Fly91 Tirupati Rajahmundry Flights : ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (Fly91) ఆంధ్రప్రదేశ్‌లో తన విమాన సేవలను వేగంగా విస్తరిస్తోంది. తిరుపతి నుంచి విజయవాడకు విమాన సేవలు ప్రారంభించిన మరుసటి రోజే… శుక్రవారం(సెప్టెంబర్ 11) నాడు తిరుపతి - రాజమండ్రి మార్గంలో కూడా ఈ సంస్థ తమ విమాన రాకపోకలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త సర్వీసుతో కలిపి ఫ్లై91 విమానయాన నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా మొత్తం 13 గమ్యస్థానాలకు చేరుకుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గురువారం రోజున ఫ్లై91 తొలి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతిని ప్రధాన కేంద్రంగా చేసుకుని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి నగరాలను అనుసంధానించే నూతన విమాన సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి-విజయవాడ సర్వీస్ మొదలవ్వగా… ఇవాళ్టి (శుక్రవారం) నుంచి తిరుపతి-రాజమండ్రి విమాన సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలు అందిస్తున్న ప్రాంతాల్లో తిరుపతి ఫ్లై91 సంస్థకు మూడవ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ఈ సంస్థ మొత్తం నాలుగు ప్రధాన నగరాలకు విమాన సేవలు అందిస్తోంది.
టైమింగ్స్ వివరాలు :
- తిరుపతి - హైదరాబాద్ : ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజూ నేరుగా ఒక విమాన సర్వీస్ నడుస్తుంది.
- తిరుపతి - విజయవాడ : వారానికి నాలుగు రోజులు చొప్పున మంగళ, గురు, శని మరియు ఆదివారాల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి.
- తిరుపతి - రాజమండ్రి : వారానికి మూడు రోజులు చొప్పున సోమ, బుధ మరియు శుక్రవారాల్లో ఈ రూట్‌లో విమానాలు నడుస్తాయి.
ప్రస్తుతం ఫ్లై91 సంస్థ దేశంలోని ప్రధాన నగరాలైన గోవా, సింధుదుర్గ్, జల్‌గావ్, సోలాపూర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, అగత్తి, కొచ్చి, హుబ్బళ్లి, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ తన సేవలను విస్తరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

