ప్రయాణికులకు అలర్ట్... హైదరాబాద్-పూణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మార్పు..! రీషెడ్యూల్ ఇలా

 Hyderabad Pune Shatabdi Express Rescheduled : హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. ఈ రైలు ఇవాళ రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది.

Published on: Sep 7, 2026, 12:09:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Pune Shatabdi Express : హైదరాబాద్ నుంచి పూణె వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అందించింది. ఇవాళ (సెప్టెంబర్ 7, 2026) మధ్యాహ్నం సికింద్రాబాద్/హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన హైదరాబాద్ - పూణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 12026) ప్రయాణ సమయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు -టైమింగ్స్ మార్పు
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు -టైమింగ్స్ మార్పు

టైమింగ్స్ మార్పు…

నిర్ణీత వేళల ప్రకారం…. ఈ రైలు ఈరోజు(సెప్టెంబర్ 7, 2026) మధ్యాహ్నం 14:40 గంటలకు (మధ్యాహ్నం 2:40 గంటలకు) హైదరాబాద్ నుంచి పూణెకు బయలుదేరాల్సి ఉంది. కానీ పలు కారణాల రీత్యా ఈ రైలును రీషెడ్యూల్ చేశారు.

తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం….. ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఈరోజు రాత్రి 23:00 గంటలకు (రాత్రి 11:00 గంటలకు) హైదరాబాద్ నుంచి పూణెకు ప్రయాణమవుతుంది. ప్రయాణికులు ఈ టైమింగ్ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం అధికారిక విచారణ కేంద్రాలను గానీ, రైల్వే యాప్‌లను గానీ సంప్రదించవచ్చు.

రైలు… బేగంపేట, వికారాబాద్ జంక్షన్ , తాండూరు, వాడి జంక్షన్, గుల్బర్గా, సోలాపూర్, పూణె జంక్షన్లలో ఆగుతుంది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. వేగవంతమైన ప్రయాణంతో పాటు రైలులోనే నాణ్యమైన ఆహార సదుపాయం ఉండటంతో…. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More