ఈ తేదీల్లో మచిలీపట్నం-తిరుచానూరు మధ్య స్పెషల్ ట్రైన్స్.. రైలు ఆగే స్టేషన్లు ఇవే!
Machilipatnam-Tiruchanur Special Trains : సెప్టెంబర్‌లో మచిలీపట్నం-తిరుచానూరు మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది రైల్వే శాఖ. తిరుపతి వెళ్లాలి అనుకునే భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
సెప్టెంబరు మాసంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, ఇతర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం, తిరుచానూరు స్టేషన్ల మధ్య వారానికి రెండు రోజులు నడిచే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

మచిలీపట్నం – తిరుచానూరు స్పెషల్ (రైలు నంబర్: 07440) ప్రతి శుక్రవారం, శనివారం సెప్టెంబర్ 11, 12, 18 తేదీలలో నడుస్తుంది. మచిలీపట్నంలో సాయంత్రం 4:55 PM గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – మచిలీపట్నం స్పెషల్ (రైలు నంబర్: 07439) ప్రతి శనివారం, ఆదివారం సెప్టెంబర్ 12, 13, 19, 20 తేదీలలో ఉంటుంది. తిరుచానూరులో తెల్లవారుజామున 3:30కి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలులో అన్ని తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్ 9 కోచ్‌లు ఉంటాయి. జనరల్ సెకండ్ క్లాస్ 4 కోచ్‌లతో ఉంటుంది.
తిరుపతిలో ప్రధాన స్టేషన్‌పై రద్దీ తగ్గించేందుకు తిరుచానూరు స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు వీకెండ్స్‌లో ప్రయాణించడానికి ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు.
సుబేదార్‌గంజ్ – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్
ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్, బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సమయంలో రద్దీని తగ్గించడానికి నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ స్టాప్‌లు ఉన్నాయి.
04135 సుబేదార్‌గంజ్ – యశ్వంతపూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది. 11.09.2026 నుండి 04.12.2026 మధ్య 13 సర్వీసులు ఉంటాయి.
04136 యశ్వంతపూర్ – సుబేదార్‌గంజ్ నడుమ ప్రతి సోమవారం ఉంటుంది. 14.09.2026 నుండి 07.12.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, కృష్ణ, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ యాద్గిర్, రాయచూర్, యలహంక, శంకర్‌గఢ్, దభౌరా, మాణిక్‌పూర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బలార్షాలో ఆగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


