SCR Special Trains : ప్రయాణికులకు శుభవార్త... చర్లపల్లి - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు! హాల్టింగ్ లిస్ట్

Charlapalli Tiruchanur Special Trains : పండుగలు, సెలవుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్ట్యా చర్లపల్లి - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.

Published on: Sep 1, 2026, 18:02:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Charlapalli Tiruchanur Special Trains : రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని చార్లపల్లి నుంచి తిరుపతి సమీపంలోని తిరుచానూరు వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసుల వల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, కోస్తాంధ్ర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.

చర్లపల్లి - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు!
చర్లపల్లి - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు!

ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు :

  • రైలు నంబరు 07025 (చర్లపల్లి – తిరుచానూరు) : ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 4, 2026 (శుక్రవారం) రోజున చర్లపల్లి స్టేషన్ నుంచి తిరుచానూరుకు బయలుదేరుతుంది. ఈ మార్గంలో ఒక సర్వీసును అందుబాటులో ఉంచారు.
  • రైలు నంబరు 07026 (తిరుచానూరు – చర్లపల్లి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5, 2026 (శనివారం) రోజున తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయలుదేరుతుంది. ఇది కూడా ఒక సర్వీసుగా అందుబాటులో ఉంటుంది.

హాల్టింగ్స్ వివరాలు…..

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు. ఫలితంగా నల్గొండ జిల్లా వాసులతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు కూడా నేరుగా తిరుపతి పరిసర ప్రాంతాలకు చేరుకోవడానికి మంచి అవకాశం లభించింది.

ప్రయాణికుల అందరి అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను ఏర్పాటు చేశారు. వీటిలో 1ఏసీ ప్లస్ 2ఏసీ, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More