South Central Railway : సెప్టెంబర్, అక్టోబర్‌లో అనేక రైళ్లు మళ్లింపు, రద్దు, టైమింగ్స్‌లో మార్పు

South Central Railway : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వేలో పనుల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, సమయాల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

Published on: Aug 31, 2026, 18:14:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెంట్రల్ రైల్వే పరిధిలోని పుణె, హడ్ప్సర్ (Hadapsar) యార్డ్‌లలో 3వ రైల్వే లైన్ కమిషనింగ్ కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

రైల్వే అప్డేట్స్
రైల్వే అప్డేట్స్

రైళ్ల మళ్లింపు

కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ ఎక్స్‌ప్రెస్ (11302) సెప్టెంబర్ 22న బయలుదేరే రైలు సోలాపూర్-కుర్దువాడి-మిరజ్-సతారా-పుణె మీదుగా నడుస్తుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22159) సెప్టెంబర్ 19 నుండి 23 వరకు, అక్టోబర్ 4న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్-దౌండ్ మీదుగా వెళ్తుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - భువనేశ్వర్ న్యూ (11019) సెప్టెంబర్ 20న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా నడుస్తుంది.

నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ (16340) సెప్టెంబర్ 22, అక్టోబర్ 02 తేదీలలో సోలాపూర్-కుర్దువాడి-దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-నాసిక్-కళ్యాణ్ మీదుగా మళ్లిస్తారు.

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్‌టీటీ (12164) అక్టోబర్ 02, 03 తేదీలలో సోలాపూర్-దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మార్గంలో వెళ్తుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - బీదర్ ఎక్స్‌ప్రెస్ (22143) అక్టోబర్ 03న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా నడుస్తుంది.

సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (22718) అక్టోబర్ 03న సోలాపూర్-కుర్దువాడి-మిరజ్-సతారా-పుణె మీదుగా నడుస్తుంది.

ముంబై ఎల్‌టీటీ - కోయంబత్తూర్ (11013) అక్టోబర్ 03న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా వెళ్తుంది.

తిరువనంతపురం - ముంబై ఎల్‌టీటీ (16332) అక్టోబర్ 03న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా నడుస్తుంది.

ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ (17222) సెప్టెంబర్ 20న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా మళ్లిస్తారు.

కోయంబత్తూర్ - ముంబై ఎల్‌టీటీ (11014) అక్టోబర్ 03న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా నడుస్తుంది.

విశాఖపట్నం - ముంబై ఎల్‌టీటీ (18519) అక్టోబర్ 02న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా వెళ్తుంది.

ముంబై ఎల్‌టీటీ - విశాఖపట్నం (18520) అక్టోబర్ 04న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్-అహల్యనగర్-దౌండ్ మీదుగా నడుస్తుంది.

పాక్షికంగా రద్దయిన రైళ్లు

కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ (11302) అక్టోబర్ 03న బయలుదేరే రైలు సోలాపూర్ వరకే పరిమితమవుతుంది.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - కేఎస్‌ఆర్ బెంగళూరు (11301) అక్టోబర్ 04న ఈ రైలు ముంబైకి బదులుగా సోలాపూర్ నుంచే ప్రయాణం ప్రారంభిస్తుంది.

కాజీపేట - హడ్ప్సర్ ఎక్స్‌ప్రెస్ (17014) సెప్టెంబర్ 19, 21, 24, 26, 28, అక్టోబర్ 01 తేదీల్లో దౌండ్ వరకే, అక్టోబర్ 03న కుర్దువాడి వరకే నడుస్తుంది.

హడ్ప్సర్ - కాజీపేట ఎక్స్‌ప్రెస్ (17013) సెప్టెంబర్ 20, 22, 25, 27, 29, అక్టోబర్ 02 తేదీల్లో దౌండ్ నుండి, అక్టోబర్ 04న కుర్దువాడి స్టేషన్ నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.

మార్గమధ్యంలో నిలిపివేసే రైళ్లు

నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16340) సెప్టెంబర్ 18, 21, 23, 25, 28, 29, 30 తేదీలలో ప్రయాణించే రైలును పటాస్ – ఉరులి సెక్షన్ పరిధిలో నిలిపివేస్తారు.

తిరువనంతపురం సెంట్రల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16332) సెప్టెంబర్ 19, 26 తేదీల్లో ఈ రైలు పటాస్ – ఉరులి మధ్య ఆలస్యంగా సాగుతుంది.

నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16352) సెప్టెంబర్ 20, 24, 27, అక్టోబర్ 01 తేదీలలో పటాస్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.

కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ (11302) సెప్టెంబర్ 18 నుండి 21 వరకు, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 02 వరకు పటాస్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22159) సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 02 వరకు చించ్వాడ్ – ఖడ్కీ సెక్షన్‌లో నిలిపివేస్తారు.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - భువనేశ్వర్ న్యూ ఎక్స్‌ప్రెస్ (11019) సెప్టెంబర్ 19, 21, 22, 23, అక్టోబర్ 03, 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ మధ్య నిలిపివేస్తారు.

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (22732) సెప్టెంబర్ 19, 21 నుండి 23 వరకు, అక్టోబర్ 03, 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ సెక్షన్‌లో నిలిపివేస్తారు.

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (20953) సెప్టెంబర్ 20న బయలుదేరే రైలును పటాస్ – ఉరులి వద్ద 1 గంట 20 నిమిషాలు నిలిపివేస్తారు.

ముంబై ఎల్‌టీటీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22179) సెప్టెంబర్ 21న చించ్వాడ్ – ఖడ్కీ మధ్య 45 నిమిషాలు ఆపుతారు.

ముంబై ఎల్‌టీటీ - కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్ (11017) సెప్టెంబర్ 19, అక్టోబర్ 03 తేదీల్లో చించ్వాడ్ – ఖడ్కీ వద్ద నిలిపివేస్తారు.

ముంబై ఎల్‌టీటీ - మదురై ఎక్స్‌ప్రెస్ (22101) సెప్టెంబర్ 23న చించ్వాడ్ – ఖడ్కీ సెషన్‌లో 1 గంట 15 నిమిషాల పాటు ఆపుతారు.

మదురై - ముంబై ఎల్‌టీటీ (22102) సెప్టెంబర్ 18, అక్టోబర్ 02 తేదీల్లో పటాస్ – ఉరులి వద్ద నిలిపివేస్తారు.

నిజామాబాద్ - పుణె ఎక్స్‌ప్రెస్ (11410) సెప్టెంబర్ 22, అక్టోబర్ 02 తేదీలలో పటాస్ – ఉరులి సెక్షన్‌లో 1 గంట 30 నిమిషాలు నిలిపివేస్తారు.

జైపూర్ - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ (20668) అక్టోబర్ 03న చించ్వాడ్ – ఖడ్కీ మధ్య 30 నిమిషాలు నిలిపివేస్తారు.

అమరావతి - పుణె ఎక్స్‌ప్రెస్ (11406) సెప్టెంబర్ 19, 21 తేదీలలో దౌండ్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.

పన్వేల్ - హెచ్.ఎస్.నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (17613) సెప్టెంబర్ 20, అక్టోబర్ 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ వద్ద నిలిపివేస్తారు.

కారైక్కాల్ - ముంబై ఎల్‌టీటీ (11018) సెప్టెంబర్ 21న దౌండ్ – లోణి సెక్షన్‌లో 1 గంట 40 నిమిషాల పాటు ఆపుతారు.

రీషెడ్యూల్ చేసిన రైళ్లు

ముంబై సీఎస్‌ఎమ్‌టీ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (22732) సెప్టెంబర్ 20, 2026న ముంబై సీఎస్‌ఎమ్‌టీ నుండి మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరుతుంది.

అమరావతి - పుణె ఎక్స్‌ప్రెస్ (11406) అక్టోబర్ 03, 2026న అమరావతి నుండి రాత్రి 7:50 గంటలకు బదులుగా 3 గంటలు ఆలస్యంగా రాత్రి 10:50 గంటలకు బయలుదేరుతుంది.

ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ (17222) అక్టోబర్ 04, 2026న ముంబై ఎల్‌టీటీ నుండి మధ్యాహ్నం 01:15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 2 గంటలు ఆలస్యంగా 03:15 గంటలకు బయలుదేరుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More