దేశంలోని వివిధ నగరాలన వేగంగా కనెక్ట్ చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటితో చాలా వేగంగా ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లొచ్చు. దీంతో చాలా మంది ఈ రైలును ఎంచుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైలుకు మంచి డిమాండ్ ఉంది. చాలా ఈ రూట్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది.
ఈ అప్డేట్ చేసిన షెడ్యూల్ రైలు నంబర్ 20707 కు వర్తిస్తుంది. ఇది తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను రద్దీగా ఉండే 699-కి.మీ రూట్‌ను కలుపుతోంది. విశాఖపట్నం జంక్షన్‌లో రద్దీని తగ్గించడానికి 2026 ఫిబ్రవరి 20 నుండి సవరించిన మార్పు అమల్లోకి వస్తుంది. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నిర్ణయించింది. ఈ రైలు గురువారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణికులు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ప్లాట్‌ఫారమ్ లభ్యతను మెరుగుపరచడానికి, టెర్మినల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి భారతీయ రైల్వే విశాఖపట్నం జంక్షన్‌లో రాక షెడ్యూల్‌ను సర్దుబాటు చేశాయి. రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్ - విశాఖపట్నం) అప్డేట్ చేసిన షెడ్యూల్ :
- సికింద్రాబాద్‌లో 05:00 గంటలు బయలుదేరుతుంది.
- విశాఖపట్నంలో కొత్తగా చేరుకునే సమయం 1:50 గంటలు
- అంతకుముందు ఈ సమయం మధ్యాహ్నం 1:45 గంటగా ఉండేది.
రైలు నంబర్ 20708 (విశాఖపట్నం - సికింద్రాబాద్) టైమింగ్ :
- విశాఖపట్నం మధ్యాహ్నం 02:30 గంటలు బయలుదేరుతుంది.
- సికింద్రాబాద్‌కు రాత్రి 11:25 గంటలకు చేరుకుంటుంది.
ఫిబ్రవరి 20వ తేదీ నుండి విశాఖపట్నంలోని టెర్మినల్‌లో రద్దీని తగ్గించడానికి ప్రత్యేకంగా ఈ కొత్త షెడ్యూల్‌ను అమలు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఆరు స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో ఉంది. ఈ రైలు 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ కారిడార్‌లో అత్యంత వేగవంతమైన కనెక్షన్‌లలో ఒకటిగా ఈ సర్వీస్‌కు డిమాండ్ ఉంది. తిరుగు ప్రయాణ రైలు 20708, దాని షెడ్యూల్ సమయాలకు అనుగుణంగా కొనసాగుతుంది.
ఈ సేవ గురువారం మినహా వారానికి ఆరు రోజులు పనిచేస్తుంది. ఈ వందే భారత్ రైతులో రెండు సీటింగ్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,750, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.3,200 ధరగా ఉంది.
{{/usCountry}}ఈ సేవ గురువారం మినహా వారానికి ఆరు రోజులు పనిచేస్తుంది. ఈ వందే భారత్ రైతులో రెండు సీటింగ్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,750, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.3,200 ధరగా ఉంది.
{{/usCountry}}విశాఖపట్నం టెర్మినల్‌లో ప్లాట్‌ఫారమ్ నిర్వహణ, రద్దీ తగ్గించడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని స్వల్పంగా ఐదు నిమిషాల మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.