SIR in Andhrapradesh : ఏపీలో ముగిసిన సర్ - 44 లక్షలకుపైగా ఓటర్లు అన్‌కలెక్టబుల్, ఈనెల 31న ముసాయిదా జాబితా
SIR Process in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక దశ ముగిసింది. రాష్ట్రంలో 44.71 లక్షల మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్‌గా గుర్తించగా… ఈ నెల 31న ముసాయిదా జాబితా విడుదల కానుంది.
SIR Process in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. ఈ ప్రక్రియకు సంబంధించి డిజిటలైజేషన్ పనులన్నింటినీ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి చేశారు. ఈ సవరణల ఆధారంగా రూపొందించే కొత్త ఓటర్ల జాబితా విడుదలపై ఎన్నికల సంఘం పలు వివరాలను వెల్లడించింది.

44 లక్షలకు పైగా 'అన్‌కలెక్టబుల్' ఓటర్లు….
ఏపీలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 44,71,523 మందిని 'అన్‌కలెక్టబుల్' ఓటర్లుగా అధికారులు గుర్తించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చిరునామా మారడం లేదా మరణించడం వంటి వివిధ సాంకేతిక, క్షేత్రస్థాయి కారణాలతో వీరిని ఈ జాబితాలో చేర్చారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే…. ఈ అన్‌కలెక్టబుల్ ఓటర్ల శాతం ఏకంగా 10.74 శాతంగా నమోదుగా ఉంది. వీటిలో అత్యధిక వాటా మరణించిన ఓటర్లదే. వీరి సంఖ్య 15,19,558 (3.65శాతం)గా గుర్తించారు.
అన్‌కలెక్టబుల్ ఓటర్ల సంఖ్య అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో తిరుపతి, కడప, విశాఖ గుంటూరు ఉన్నాయి. ఇవే కాకుండా మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి.
సవరించిన వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 31వ తేదీన అధికారికంగా విడుదల చేయడానికి ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత…. అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయాన్ని కేటాయిస్తారు. ఆపై క్షేత్రస్థాయి పరిశీలనలు…. వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాత, అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: 31.07.2026న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
- అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలు : కొత్త ఓటర్ల నమోదు, మార్పులపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను సమర్పించడానికి 31.07.2026 నుండి 30.08.2026 వరకు సమయం ఉంటుంది.
- నోటీసుల దశ / క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: సమర్పించిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను 31.07.2026 నుండి 28.09.2026 వరకు చేపడతారు.
- తుది ఓటర్ల జాబితా ప్రచురణ : అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 03.10.2026న అధికారికంగా ప్రచురిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

