నైరుతి రుతుపవనాల రాకతో సముద్రంలో ఏర్పడిన అల్లకల్లోల వాతావరణం, బలమైన ఈదురుగాలుల కారణంగా విశాఖపట్నం తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కాగా…. మరో వ్యక్తిని కాపాడారు.

విశాఖపట్నం ఫిషింగ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... జూలై 1వ తేదీన ఈ ఏడుగురు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ముందుగా సమాచారం అందించారు.
ఫోన్లు స్విచ్ఛాప్.. రంగంలోకి కోస్ట్ గార్డ్
శనివారం (జూలై 4) మధ్యాహ్నం దాటినా మత్స్యకారులు తిరిగి రాకపోవడం, వారి మొబైల్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాప్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే మెరైన్ పోలీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులను ఆశ్రయించారు. మత్స్యకారులు తమ వేట ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని…, భారీ గాలుల ధాటికి బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. రుతుపవనాల ప్రభావంతో సుమారు 400 బోట్లు వేటకు వెళ్లగా…. మారుతున్న వాతావరణం. ఈదురుగాలుల వల్ల పలు బోట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆయన తెలిపారు.
ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ - సీఎం ఆదేశాలు
మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విశాఖపట్నంలోని ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడి… సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు. మెరైన్ పోలీస్, వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని, రెస్క్యూ ఆపరేషన్ అప్డేట్స్ను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
{{/usCountry}}మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విశాఖపట్నంలోని ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడి… సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు. మెరైన్ పోలీస్, వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని, రెస్క్యూ ఆపరేషన్ అప్డేట్స్ను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
{{/usCountry}}ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు…. గాలింపు చర్యల వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఇప్పటికే నేవీకి చెందిన హెలీకాప్టర్ తో గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలు తెలియజేయాలని నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.