SCR Train Timings Change : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు కీలక మార్గాల్లో నడిచే ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ప్రధానంగా గుంటూరు, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నంద్యాల తదితర స్టేషన్ల గుండా వెళ్లే రైళ్ల సమయాలను సవరించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

నవంబర్ మొదటి వారం నుంచే ఈ కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. వేర్వేరు తేదీల నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మైసూర్ - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17290) :
ఈ రైలు గుంటూరు స్టేషన్‌కు మునుపటి కంటే త్వరగా రానుంది. ఇప్పటివరకు మధ్యాహ్నం 15.51 గంటలకు వచ్చి 15.56 గంటలకు బయలుదేరే ఈ రైలు, నవంబర్ 7, 2026 నుంచి మధ్యాహ్నం 15.00 గంటలకే గుంటూరు చేరుకుని 15.05 గంటలకు బయలుదేరుతుంది.
హిసార్ - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17296) :
హిసార్ నుంచి కాకినాడ వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు రావటం, వెళ్లే సమయాల్లో మార్పు జరిగింది. నవంబర్ 6, 2026 నుంచి ఇది సాయంత్రం 16.11/16.16 గంటలకు బదులుగా మధ్యాహ్నం 15.40 గంటలకు గుంటూరు చేరుకుని 15.45 గంటలకు బయలుదేరుతుంది.
చర్లపల్లి - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17444) :
నవంబర్ 6, 2026 నుంచి ఈ రైలు పలు స్టేషన్లలో కొత్త సమయాల్లో అందుబాటులో ఉంటుంది.
- నడికుడి : రాత్రి 19.19/19.20 (పాత సమయం 19.30/19.32)
- పిడుగురాళ్ల : రాత్రి 19.38/19.40 (పాత సమయం 20.05/20.07)
- మార్కాపూర్ రోడ్ : రాత్రి 21.05/21.07 (పాత సమయం 21.20/21.22)
- గిద్దలూరు : రాత్రి 22.05/22.07 (పాత సమయం 22.38/23.40)
- దిగువమెట్ట : రాత్రి 22.20/22.30 (పాత సమయం 22.57/23.07)
- నంద్యాల : రాత్రి 23.40/23.45 (పాత సమయం 00.20/00.25)
- గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17251)
- గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ఈ రైలు బయలుదేరే సమయాన్ని ముందు జరిపారు. నవంబర్ 4, 2026 నుంచి గుంటూరు స్టేషన్ నుంచి సాయంత్రం 18.40 గంటలకు బదులుగా 18.00 గంటలకే బయలుదేరుతుంది.
తిరువనంతపురం నార్త్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 20630) :
ఈ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4, 2026 నుంచి సత్తెనపల్లి స్టేషన్‌కు ఉదయం 06.44 గంటలకు చేరుకుని 06.45 గంటలకు బయలుదేరుతుంది. గతంలో ఇది 06.54/06.55 గంటలకు వచ్చేది.
కాచిగూడ - రేపల్లె ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17625) :
{{/usCountry}}ఈ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4, 2026 నుంచి సత్తెనపల్లి స్టేషన్‌కు ఉదయం 06.44 గంటలకు చేరుకుని 06.45 గంటలకు బయలుదేరుతుంది. గతంలో ఇది 06.54/06.55 గంటలకు వచ్చేది.
కాచిగూడ - రేపల్లె ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17625) :
{{/usCountry}}నవంబర్ 4, 2026 నుంచి పిడుగురాళ్ల స్టేషన్‌లో ఈ రైలు సమయం మారింది. అర్ధరాత్రి దాటాక 02.51/02.52 గంటలకు బదులుగా 02.41 గంటలకు వచ్చి 02.42 గంటలకు బయలుదేరుతుంది.
తిరుచిరాపల్లి - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17078) :
నవంబర్ 4, 2026 నుంచి ఈ రైలు ప్రధాన స్టేషన్లలో ముందే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
- గుంటూరు: మధ్యాహ్నం 14.40/14.50 (పాత సమయం 15.05/15.15)
- సత్తెనపల్లి: మధ్యాహ్నం 15.19/15.20 (పాత సమయం 15.33/15.35)
- నడికుడి: సాయంత్రం 15.59/16.00 (పాత సమయం 16.23/16.25)
- తిరువనంతపురం నార్త్ - చార్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17042)
- నవంబర్ 4, 2026 నుంచి ఈ రైలు గుంటూరు మరియు సత్తెనపల్లి సమయాల్లో మార్పులు చేశారు.
- గుంటూరు: సాయంత్రం 17.00/17.10 (పాత సమయం 17.40/17.50)
- సత్తెనపల్లి: సాయంత్రం 17.45/17.46 (పాత సమయం 18.59/19.00)