యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రస్థానంలో మరో మైలురాయి - నైనీ నుంచి చేరిన తొలి బొగ్గు రైలు

TGGENCO Yadadri Power Plant Coal Supply : ఒడిశాలోని నైనీ గని నుంచి 4,000 టన్నుల నాణ్యమైన బొగ్గుతో కూడిన తొలి రైలు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు చేరుకుంది. నాణ్యమైన బొగ్గు లభ్యతతో తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది.

Published on: Sep 2, 2026, 12:29:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TGGENCO Yadadri Power Plant : తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగంలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) విద్యుత్ ఉత్పత్తి దిశగా ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పర్యవేక్షణలో నడుస్తున్న ఒడిశాలోని ప్రతిష్టాత్మక 'నైనీ' బొగ్గు గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ (మాల్‌గాడి) మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది. సుమారు 4,000 టన్నుల లోడుతో వచ్చిన ఈ తొలి బొగ్గు రైలుకు టీజీజెన్‌కో అధికారులు ఘన స్వాగతం పలికారు.

నైనీ నుంచి చేరిన తొలి బొగ్గు రేక్
నైనీ నుంచి చేరిన తొలి బొగ్గు రేక్

నైనీ బ్లాక్ నుండి వచ్చిన ఈ బొగ్గు అత్యధిక ఉష్ణ సామర్థ్యం (High-Calorific Value) కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికి మరియు ప్లాంట్‌లో గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.

1,050 కిలోమీటర్ల సుదూర రవాణా….

ఒడిశాలోని నైనీ గని నుండి యాదాద్రి ప్లాంట్‌కు సుమారు 1,050 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఉంది. అంతటి సుదూర ప్రయాణం చేసి బొగ్గును రవాణా చేయడం సవాలుతో కూడుకున్నప్పటికీ…. ఈ బొగ్గులోని విశిష్ట గుణాలు ఆ వ్యయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఈ బొగ్గు వాడటం వల్ల బాయిలర్ల పనితీరు గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సమయంలో వచ్చే బూడిద సమస్యలు చాలావరకు తగ్గుతాయి. టీజీజెన్‌కో, సింగరేణి , భారతీయ రైల్వేల మధ్య నెలకొన్న అద్భుతమైన సమన్వయం వల్ల ఈ సుదూర బొగ్గు రవాణా సాఫీగా సాధ్యమైందని అధికారులు కొనియాడారు.

రాబోయే రోజుల్లో నైనీ మైన్ నుండి నిరంతరాయంగా రోజువారీ బొగ్గు రేకులు యాదాద్రి ప్లాంట్‌కు రానున్నాయి. దీనివల్ల వైటీపీఎస్‌లో ఎల్లప్పుడూ తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి పూర్తి గ్యారెంటీ లభించిందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More