Train Timings Change : తెలుగు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఈ 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్ మార్పు..! కొత్త షెడ్యూల్ ఇలా
SCR Train Timings Change : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 8 కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను మార్చారు. గుంటూరు, సికింద్రాబాద్, చర్లపల్లి మార్గాల్లో ప్రయాణించే రైళ్ల కొత్త సమయాలు, అమల్లోకి వచ్చే తేదీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
SCR Train Timings Change : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు కీలక మార్గాల్లో నడిచే ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ప్రధానంగా గుంటూరు, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నంద్యాల తదితర స్టేషన్ల గుండా వెళ్లే రైళ్ల సమయాలను సవరించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

నవంబర్ మొదటి వారం నుంచే ఈ కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. వేర్వేరు తేదీల నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మైసూర్ - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17290) :
ఈ రైలు గుంటూరు స్టేషన్‌కు మునుపటి కంటే త్వరగా రానుంది. ఇప్పటివరకు మధ్యాహ్నం 15.51 గంటలకు వచ్చి 15.56 గంటలకు బయలుదేరే ఈ రైలు, నవంబర్ 7, 2026 నుంచి మధ్యాహ్నం 15.00 గంటలకే గుంటూరు చేరుకుని 15.05 గంటలకు బయలుదేరుతుంది.
హిసార్ - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17296) :
హిసార్ నుంచి కాకినాడ వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు రావటం, వెళ్లే సమయాల్లో మార్పు జరిగింది. నవంబర్ 6, 2026 నుంచి ఇది సాయంత్రం 16.11/16.16 గంటలకు బదులుగా మధ్యాహ్నం 15.40 గంటలకు గుంటూరు చేరుకుని 15.45 గంటలకు బయలుదేరుతుంది.
చర్లపల్లి - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17444) :
నవంబర్ 6, 2026 నుంచి ఈ రైలు పలు స్టేషన్లలో కొత్త సమయాల్లో అందుబాటులో ఉంటుంది.
- నడికుడి : రాత్రి 19.19/19.20 (పాత సమయం 19.30/19.32)
- పిడుగురాళ్ల : రాత్రి 19.38/19.40 (పాత సమయం 20.05/20.07)
- మార్కాపూర్ రోడ్ : రాత్రి 21.05/21.07 (పాత సమయం 21.20/21.22)
- గిద్దలూరు : రాత్రి 22.05/22.07 (పాత సమయం 22.38/23.40)
- దిగువమెట్ట : రాత్రి 22.20/22.30 (పాత సమయం 22.57/23.07)
- నంద్యాల : రాత్రి 23.40/23.45 (పాత సమయం 00.20/00.25)
- గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17251)
- గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ఈ రైలు బయలుదేరే సమయాన్ని ముందు జరిపారు. నవంబర్ 4, 2026 నుంచి గుంటూరు స్టేషన్ నుంచి సాయంత్రం 18.40 గంటలకు బదులుగా 18.00 గంటలకే బయలుదేరుతుంది.
తిరువనంతపురం నార్త్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 20630) :
ఈ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4, 2026 నుంచి సత్తెనపల్లి స్టేషన్‌కు ఉదయం 06.44 గంటలకు చేరుకుని 06.45 గంటలకు బయలుదేరుతుంది. గతంలో ఇది 06.54/06.55 గంటలకు వచ్చేది.
కాచిగూడ - రేపల్లె ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17625) :
నవంబర్ 4, 2026 నుంచి పిడుగురాళ్ల స్టేషన్‌లో ఈ రైలు సమయం మారింది. అర్ధరాత్రి దాటాక 02.51/02.52 గంటలకు బదులుగా 02.41 గంటలకు వచ్చి 02.42 గంటలకు బయలుదేరుతుంది.
తిరుచిరాపల్లి - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17078) :
నవంబర్ 4, 2026 నుంచి ఈ రైలు ప్రధాన స్టేషన్లలో ముందే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
- గుంటూరు: మధ్యాహ్నం 14.40/14.50 (పాత సమయం 15.05/15.15)
- సత్తెనపల్లి: మధ్యాహ్నం 15.19/15.20 (పాత సమయం 15.33/15.35)
- నడికుడి: సాయంత్రం 15.59/16.00 (పాత సమయం 16.23/16.25)
- తిరువనంతపురం నార్త్ - చార్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17042)
- నవంబర్ 4, 2026 నుంచి ఈ రైలు గుంటూరు మరియు సత్తెనపల్లి సమయాల్లో మార్పులు చేశారు.
- గుంటూరు: సాయంత్రం 17.00/17.10 (పాత సమయం 17.40/17.50)
- సత్తెనపల్లి: సాయంత్రం 17.45/17.46 (పాత సమయం 18.59/19.00)
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

