సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ, వికారాబాద్, నాందేడ్, మచిలీపట్నం మధ్య రైళ్లు నడుస్తాయి. విజయవాడ, సికింద్రాబాద్, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లలో కూడా ఆగుతాయి. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రైలు నెం. 07450 కాకినాడ టౌన్ - వికారాబాద్ జనవరి 19న సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం. 07451 వికారాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ - వికారాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్‌లు.. సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.
రైలు నెం.07452 నాందేడ్ - కాకినాడ టౌన్ జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం.07453 కాకినాడ టౌన్ - నాందేడ్ జనవరి 13న మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
నాందేడ్ - కాకినాడ టౌన్ - నాందేడ్ ప్రత్యేక రైళ్లు.. ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోలారం, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి రెండు స్టేషన్లలో ఆగుతాయి.
మచిలీపట్నం-వికారాబాద్ మధ్య రైలు నెంబర్ 07454 జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 07455 వికారాబాద్-మచిలీపట్నం రైలు జనవరి 11, 18 తేదీల్లో రాత్రి పది గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుకుంటుంది.
{{/usCountry}}మచిలీపట్నం-వికారాబాద్ మధ్య రైలు నెంబర్ 07454 జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 07455 వికారాబాద్-మచిలీపట్నం రైలు జనవరి 11, 18 తేదీల్లో రాత్రి పది గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుకుంటుంది.
{{/usCountry}}మచిలీపట్నం-వికారాబాద్-మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.
క్రిస్‌మస్, న్యూ ఇయర్ స్పెషల్ రైళ్లు
క్రిస్‌మస్, న్యూ ఇయర్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్-ముంబయి మధ్య రైలు నెంబర్ 07458 డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం 5.30కి బయల్దేరి.. మరిసటి రోజు ఉదయం 10.40కి ముంబయికి చేరుకుంటుంది. ముంబయి నుంచి 07459 రైలు డిసెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 3.20కి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్బూర్గి, సోలాపూర్, పూణే, కల్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటే మంచిది.