...
...
Next Story

SCR Summer Special Trains : వేసవి వేళ ప్రయాణికుల రద్దీ - ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు..! హాల్ట్ స్టేషన్ల వివరాలు

SCR Summer Special Trains 2026 : వేసవి వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తాంబరం (చెన్నై) - సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: May 24, 2026, 17:31:40 IST
Advertisement

SCR Summer Special Trains 2026 :వేసవి సెలవులు ఉండటంతో రైల్వేస్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది.ఈ అదనపు రద్దీని నియంత్రించడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు

తాజాగా తమిళనాడులోని తాంబరం (చెన్నై సమీపం), పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి (కోల్‌కతా సమీపం) మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఇందులో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

తాంబరం - సంత్రాగచ్చి:

  • తాంబరం నుంచి సంత్రాగచ్చి వెళ్లే ఈ వీక్లీ స్పెషల్ రైలు మే 27, 2026 నుంచి జూన్ 24, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
  • ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 01:00 గంటలకు (అంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) తాంబరంలో బయలుదేరి…. మరుసటి రోజు (గురువారం) తెల్లవారుజామున 05:45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.
  • మే నెలలో 27.. జూన్ నెలలో 03, 10, 17, 24 తేదీల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 సర్వీసులు నడుస్తాయి.

సంత్రాగచ్చి- తాంబరం :

  • సంత్రాగచ్చి నుంచి తిరుగు ప్రయాణంలో తాంబరం వచ్చే ఈ వీక్లీ స్పెషల్ రైలు మే 28, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు నడుస్తుంది.
  • ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 23:40 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరుతుంది. శనివారం తెల్లవారుజామున 04:15 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
  • మే నెలలో 28.. జూన్ నెలలో 04, 11, 18, 25 తేదీల్లో ఈ రైలు నడుస్తుంది. ఇందులోనూ మొత్తం 5 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం విభిన్న క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏసీ త్రీ టైర్ (AC 3-Tier), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లతో పాటు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

హాల్టింగ్ స్టేషన్ల లిస్ట్ :

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించేటప్పుడు చెన్నై ఎగ్మూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి.

వేసవి సెలవుల కారణంగా రెగ్యులర్ రైళ్లలో టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కాబట్టి….. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe