చర్లపల్లి-తిరుచిరాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్.. ఏపీ, తెలంగాణలో హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చర్లపల్లి నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చింది.

Published on: May 24, 2026, 07:08:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి-తిరుచిరాపల్లి-చర్లపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుపుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ నెంబర్ 17077 చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లికి 07.07.2026 రోజున మంగళవారం బయల్దేరుతుంది. అలాగే ట్రైన్ నెంబర్ 17078 తిరుచిరాపల్లి నుంచి చర్లపల్లికి బుధవారం రోజున 08.07.2026 రోజున బయల్దేరుతుంది.

చర్లపల్లి-తిరుచిరాపల్లి
చర్లపల్లి-తిరుచిరాపల్లి

ఈ ట్రైన్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణమలై, తిరుక్కోవిలూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూర్, శ్రీరంగం, తిరుచిరాపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్

తిరుపతి, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు కూడా దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి - తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును రెగ్యూలరైజ్ చేసింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్లే ఈ రైలు (ట్రెయిన్ నెం. 17443) వారానికి ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ 2026 మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం గురువారం సాయంత్రం 16:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి….. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 08:25 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

చర్లపల్లి - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు (ట్రెయిన్ నెం. 17444) 2026 మే 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. శనివారం ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More