SCR Weekly Express : తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్, హాల్ట్ స్టేషన్లు ఇవే

SCR Weekly Express : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది.చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ స్టేషన్ల మధ్య  వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.

Published on: May 22, 2026, 15:50:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Charlapalli Bhubaneswar New Express : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు అందించింది. గతంలో నడిచిన చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ వీక్లీ స్పెషల్ రైళ్లను (Train No. 07165/07166) క్రమబద్ధీకరించింది. వాటి స్థానంలో సరికొత్తగా రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ (PTI File Photo)
ప్రయాణికులకు గుడ్ న్యూస్ (PTI File Photo)

రైలు నంబరు 17067/17068 తో నడిచే ఈ సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మే 25, 2026 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

  • రైలు నంబరు 17067 (చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ వీక్లీ ఎక్స్‌ప్రెస్): ఈ రైలు ప్రతి వారం సోమవారం రోజు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. దీని రెగ్యులర్ సర్వీసులు మే 25, 2026 నుంచి ప్రారంభమవుతాయి.
  • రైలు నంబరు 17068 (భువనేశ్వర్ న్యూ – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్) : ప్రతి వారం మంగళవారం భువనేశ్వర్ న్యూ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. దీని రెగ్యులర్ సర్వీసులు మే 26, 2026 నుంచి ప్రారంభమవుతాయి.

రైలు నంబరు 17067 (చర్లపల్లి – భువనేశ్వర్):

చర్లపల్లిలో సోమవారం సాయంత్రం 18:10 గంటలకు బయలుదేరి.. నల్గొండ (19:18), మిర్యాలగూడ (19:58), గుంటూరు (23:05), విజయవాడ (మంగళవారం తెల్లవారుజామున 00:35), కైకలూరు (02:08), ఆకివీడు (02:28), భీమవరం టౌన్ (02:48), తణుకు (03:13), రాజమండ్రి (04:28), సామర్లకోట (05:38), అన్నవరం (06:18), అనకాపల్లి (08:18), దువ్వాడకి 09:10 గంటలకు చేరుకుంటుంది.

ఇక పెందుర్తి (09:50), కొత్తవలస (10:00), విజయనగరం జంక్షన్ (10:35), శ్రీకాకుళం రోడ్ (11:40), పలాస (13:00), బ్రహ్మపూర్ (13:51), ఖుర్దా రోడ్ జంక్షన్ (15:41), భువనేశ్వర్ (16:03) మీదుగా ప్రయాణించి.. మంగళవారం సాయంత్రం 16:45 గంటలకు భువనేశ్వర్ న్యూ జంక్షన్‌కు చేరుకుంటుంది.

రైలు నంబరు 17068 (భువనేశ్వర్ - చర్లపల్లి ):

తిరుగు ప్రయాణంలోని ఈ రైలు భువనేశ్వర్ న్యూ జంక్షన్ లో మంగళవారం రాత్రి 22:15 గంటలకు బయలుదేరుతుంది. భువనేశ్వర్ (22:40), ఖుర్దా రోడ్ (23:10).. బ్రహ్మపూర్ (బుధవారం తెల్లవారుజామున 01:43), పలాస (02:33), శ్రీకాకుళం రోడ్ (03:30), విజయనగరం (04:45), కొత్తవలస (05:23), పెందుర్తి (05:33), దువ్వాడ (07:03), అనకాపల్లి (07:18), అన్నవరం (08:18), సామర్లకోటకు 08:53 గంటలకు చేరుకుంటుంది.

ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 09:28 గంటలకు, తణుకు (10:48), భీమవరం టౌన్ (11:28), ఆకివీడు (11:43), కైకలూరు (11:58), విజయవాడ (మధ్యాహ్నం 13:50), గుంటూరు (15:00), మిర్యాలగూడ (18:48), నల్గొండ (19:28) స్టేషన్ల మీదుగా ప్రయాణించి.. బుధవారం రాత్రి 21:50 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.

వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు అన్ని రకాల శ్రేణుల బోగీలు అందుబాటులో ఉంటాయి.

  • 3 - సెకండ్ ఏసీ (2A) బోగీలు
  • 5 - థర్డ్ ఏసీ (3A) బోగీలు
  • 10 - స్లీపర్ క్లాస్ (Sleeper) బోగీలు
  • 4 - జనరల్ సెకండ్ క్లాస్ (General) బోగీలు

ఈ మార్గంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే స్టేషన్లలోని అధికారిక రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఈ రైళ్లకు టికెట్ బుకింగ్స్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More