తెలుగు ప్రయాణికులకు శుభవార్త : చర్లపల్లి - తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ రైలు, టైమింగ్స్, హాల్టింగ్స్ ఇవే
SCR Charlapalli Tiruchanur Weekly Express : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి - తిరుచానూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును క్రమబద్ధీకరిస్తూ పూర్తిస్థాయి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
SCR Charlapalli Tiruchanur Weekly Express : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు…. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని…. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా సేవలందించిన ఈ సర్వీసును ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

- చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి వీక్లీ స్పెషల్(రైలు నంబరు 07017/07018) రైలు… ఇకపై రెగ్యులర్ సర్వీసుగా ఉంటాయి. దీంతో రైలు నంబరు 17059/17060 (చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా పట్టాలెక్కనుంది.
- రైల్వే అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…. ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 2026 మే నెల నుంచే అందుబాటులోకి రానున్నాయి.
- చర్లపల్లి - తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 17059) సర్వీసు… 17.05.2026 (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 17060) సర్వీస్…. 18.05.2026 (సోమవారం) నుంచి తన సేవలను ప్రారంభించనుంది.
చర్లపల్లి నుంచి తిరుచానూరు - ఆగే స్టేషన్లు:
ఆదివారం రాత్రి 21:30 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి మల్కాజ్‌గిరి (22.15), కాచిగూడ (22.40), షాద్‌నగర్ (23.29) మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్‌నగర్ (00.15), వనపర్తి రోడ్ (01.19), గద్వాల్ (01.45) స్టేషన్లకు చేరుకుంటుంది. అనంతరం కర్నూలు సిటీ (03.35), డోన్ (04.45), గుత్తి (05.43), తాడిపత్రి (06.33), ఎర్రగుంట్ల (07.28), కడప (07.58), రాజంపేట (08.48), రేణిగుంట (10.30) మీదుగా ప్రయాణించి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు నుంచి చర్లపల్లి….
తిరుగు ప్రయాణంలో ఈ రైలు సోమవారం సాయంత్రం 16:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. రేణిగుంట (16.13), రాజంపేట (17.08), కడప (17.58), ఎర్రగుంట్ల (18.23), తాడిపత్రి (19.23), గుత్తి (20.58), డోన్ (23.55) స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున కర్నూలు సిటీ (00.50), గద్వాల్ (02.05), వనపర్తి రోడ్ (02.29), మహబూబ్‌నగర్ (03.40), షాద్‌నగర్ (04.29), కాచిగూడ (05.50), మల్కాజ్‌గిరి (06.25) స్టేషన్లకు చేరుకుని, చివరగా మంగళవారం ఉదయం 08.00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా కోచ్‌లను కేటాయించారు. ఈ రైలులో మొత్తం 2-సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లు, 7-థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లు, 7-స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4-జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

