తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి-తిరుచిరాపల్లి-చర్లపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ నడుపుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ నెంబర్ 17077 చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లికి 07.07.2026 రోజున మంగళవారం బయల్దేరుతుంది. అలాగే ట్రైన్ నెంబర్ 17078 తిరుచిరాపల్లి నుంచి చర్లపల్లికి బుధవారం రోజున 08.07.2026 రోజున బయల్దేరుతుంది.

ఈ ట్రైన్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణమలై, తిరుక్కోవిలూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూర్, శ్రీరంగం, తిరుచిరాపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు కూడా దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి - తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును రెగ్యూలరైజ్ చేసింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్లే ఈ రైలు (ట్రెయిన్ నెం. 17443) వారానికి ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ 2026 మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం గురువారం సాయంత్రం 16:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి….. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 08:25 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
చర్లపల్లి - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు (ట్రెయిన్ నెం. 17444) 2026 మే 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. శనివారం ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
{{/usCountry}}చర్లపల్లి - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు (ట్రెయిన్ నెం. 17444) 2026 మే 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. శనివారం ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
{{/usCountry}}ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లు ఉన్నాయి.