ఈ తేదీన తిరుపతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు.. అంతేకాదు హోలీకి 160 స్పెషల్ ట్రైన్స్

పండుగల సందర్భాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా తిరుపతికి ప్రత్యేక రైలును ప్రకటించింది. అంతేకాదు హోలీకి 160 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది.

Published on: Feb 10, 2026, 11:48:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రాయలసీమ జిల్లాల మీదుగా కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే రైలు 07511 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12వ తేదీన గురువారం రాత్రి 10:40 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ఈ రైలు ఉందానగర్, షాద్‌నగర్, జడ్జర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

హోలీకి ప్రత్యేక రైళ్లు

మార్చి 4వ తేదీన హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఇబ్బంది లేని ప్రయాణం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 160 ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రణాళిక వేసింది. పండుగ కాలంలో ప్రయాణికుల డిమాండ్ పెరుగుదలను తీర్చడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య సజావుగా కనెక్టివిటీని ఉంచడం ఈ ప్రత్యేక సేవలు లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెలలో నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి నుండి దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతాయి.

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుండి నడిచే ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రక్సౌల్, నహర్‌లగున్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిసార్, లక్నో, సంత్రాగచి, మాల్డా టౌన్, చాప్రా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ అన్ని గమ్యస్థానాల నుండి తిరుగు ప్రయాణాలను కూడా ప్లాన్ చేశారు.

ఈ అదనపు సేవలు డిమాండ్‌ను తీర్చడం ద్వారా రద్దీని గణనీయంగా తగ్గిస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ప్రత్యక్ష కనెక్టివిటీని ఈ ట్రైన్లు అందిస్తాయని వెల్లడించింది. ప్రయాణాలను వేగంగా, మరింత సౌకర్యవంతంగా చేస్తాయని తెలిపింది. ప్రధాన పండుగల సమయంలో ప్రయాణికుల సౌలభ్యం, భద్రత, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి దక్షిణ మధ్య రైల్వే కట్టుబడి ఉందని పేర్కొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More