Sambalpur to Charlapalli Special Train : పండగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగిన ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ప్రత్యేక వన్‌వే స్పెషల్ రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ట్రైన్ టైమింగ్స్….

రైలు నంబరు 08309 (సంబల్‌పూర్ – చర్లపల్లి) వన్‌వే స్పెషల్ రైలు ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నాడు సంబల్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 11:45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శనివారం) ఉదయం 11:30 గంటలకు చార్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక రైలుకు కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది.
- ఒడిశా, ఉత్తరాంధ్ర మార్గం : బర్గఢ్ రోడ్, బలంగీర్, తిట్లగఢ్, కేసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ.
- కోస్తాంధ్ర, తెలంగాణ మార్గం : సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ మరియు నల్గొండ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
కోచ్‌ల వివరాలు
ఈ వన్‌వే ప్రత్యేక రైలులో ప్రయాణికుల వసతి కోసం స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లి హైదరాబాద్ తిరిగొచ్చే ఉద్యోగులు, విద్యార్థులు మరియు ఇతర ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.