SCR Special Trains : విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు - తేదీలు, ఆగే స్టేషన్లు ఇవే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. విశాఖ - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈనలె 18,19 తేదీల్లో ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.

Published on: Jan 17, 2026, 13:20:21 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్లగా... తిరుగు ప్రయాణాలు షురూ చేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రద్దని తగ్గించేందుకు విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

విశాఖ - చర్లపల్లి స్పెషల్ ట్రైన్…

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 08517) జనవరి 18వ తేదీన ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైమ్ మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి... మరునాడు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

చర్లపల్లి - విశాఖపట్నం(ట్రైన్ నెంబర్ 08518) మధ్య జనవరి 19వ తేదీన మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు... చర్లపల్లి నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామల్ కోట, రాజమండ్రి, నిడదోవలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లులో 2ఏసీ, 3ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి. ఈసేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

మరోవైపు వికారాబాద్ - తిరుపతి మధ్య జనవరి 19వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రత్యేక రైలు సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్... సత్తెనపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More