పండగల వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరువనంతపురం - సంత్రాగచ్చి, పోదనూర్ – బరౌనీ రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
ప్రత్యేక రైళ్లు - రూట్లు ఇవే….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం....తిరువనంతపురం - సంత్రాగచ్చి(ట్రైన్ నెంబర్ 06081) మధ్య మార్చి 13, 20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ 14:15 గంటలకు బయల్దేరి.. రెండో రోజు మధ్యాహ్నం 14:15 గంటలకు సంత్రాగచ్చి స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక సంత్రాగచ్చి - తిరువనంతపురం(06082) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మార్చి 10,17 తేదీల్లో ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 14:20 నిమిషాలకు బయల్దేరి... రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు... కొల్లాం, కాయంకులం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనాశేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, తిరుత్తని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి.
ఇక పోదనూర్ – బరౌనీ(ట్రైన్ నెంబర్ 06021) మధ్య మార్చి 16,23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ తెల్లవారుజామున 04:30 గంటలకు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు బరౌనీ చేరుకుంటాయి. బరౌనీ – పోదనూర్(06022) మధ్య మార్చి 19,26 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. బరౌనీ నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు ట్రైన్ బయల్దేరి... రెండో రోజు రాత్రి 11.30 నిమిషాలకు పోదనూర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చిరాలా, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాఘజ్నగర్, బల్హార్షా, చందర్పూర్, నాగ్పూర్, బేతుల్, ఇటార్సి, జబల్పూర్, సత్నా, మణిక్పూర్, ప్రయాగ్రాజ్ చెహోకి, చునార్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా, దానాపూర్, పాటలిపుత్ర, హాజీపూర్, షాహ్పూర్ పట్టోరీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చిరాలా, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాఘజ్నగర్, బల్హార్షా, చందర్పూర్, నాగ్పూర్, బేతుల్, ఇటార్సి, జబల్పూర్, సత్నా, మణిక్పూర్, ప్రయాగ్రాజ్ చెహోకి, చునార్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా, దానాపూర్, పాటలిపుత్ర, హాజీపూర్, షాహ్పూర్ పట్టోరీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}