Machilipatnam Shivamogga Special Train : తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ప్రయాణించే రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం నుంచి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన శివమొగ్గ టౌన్ మధ్య ఒక ప్రత్యేక రైలు సర్వీసును నడపనున్నట్లు వెల్లడించింది. పండుగలు, వారాంతపు రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

మచిలీపట్నం – శివమొగ్గ టౌన్ ప్రత్యేక రైలు (రైలు నంబరు 07217) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30 (ఆదివారం) మధ్యాహ్నం 15:55 గంటలకు మచిలీపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
- ఈ రైలు గుడివాడ (16:23/16:25), విజయవాడ (17:25/17:35), గుంటూరు (18:50/18:55), నరసరావుపేట (19:17/19:18), దొనకొండ (20:27/20:28), మార్కాపురం (20:57/20:58), కంభం (21:20/21:21), గిద్దలూరు (21:57/21:58), నంద్యాల (23:50/23:55) మీదుగా ప్రయాణిస్తుంది.
- అనంతరం అర్ధరాత్రి దాటాక బెతంచెర్ల (00:43/00:45), డోన్ (01:23/01:25), గుత్తి (02:28/02:30), అనంతపురం (03:23/03:25), ధర్మవరం (04:20/04:30), సత్యసాయి ప్రశాంతి నిలయం (04:50/04:52), హిందూపూర్ (05:45/05:47) దాటుకుని యలహంక (08:23/08:25), తుమకూరు (09:50/09:52), తిప్టూర్ (11:18/11:20), అరసికెరె (11:40/11:45), బీరూర్ (12:20/12:22), తరికెరె (12:48/12:50), భద్రావతి (14:15/14:17) మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 15:00 గంటలకు శివమొగ్గ టౌన్ చేరుకుంటుంది.
శివమొగ్గ టౌన్ – మచిలీపట్నం ప్రత్యేక రైలు (రైలు నంబరు 07218) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 సెప్టెంబర్ 02 (బుధవారం) సాయంత్రం 17:40 గంటలకు శివమొగ్గ టౌన్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
ఈ రైలు భద్రావతి (17:58/18:00), తరికెరె (18:16/18:18), బీరూర్ (18:43/18:45), అరసికెరె (19:20/19:25), తిప్టూర్ (19:45/19:47), తుమకూరు (20:20/20:22), యలహంక (23:35/23:37) మీదుగా ప్రయాణించి మరుసటి రోజు రాత్రి హిందూపూర్ (00:43/00:45), సత్యసాయి ప్రశాంతి నిలయం (02:30/02:32), ధర్మవరం (03:55/04:00), అనంతపురం (04:28/04:30), గుత్తి (05:43/05:45), డోన్ (06:55/07:00)కు చేరుకుంటుంది.
ఇక బెతంచెర్ల (07:28/07:30), నంద్యాల (08:30/08:35), గిద్దలూరు (09:45/09:47), కంభం (10:13/10:15), మార్కాపురం (10:32/10:33), దొనకొండ (10:55/10:57), నరసరావుపేట (12:15/12:17), గుంటూరు (13:15/13:20), విజయవాడ (14:10/14:20), గుడివాడ (15:03/15:05) దాటుకుని మధ్యాహ్నం 15:55 గంటలకు మచిలీపట్నం స్టేషన్కు చేరుకుంటుంది.
{{/usCountry}}ఇక బెతంచెర్ల (07:28/07:30), నంద్యాల (08:30/08:35), గిద్దలూరు (09:45/09:47), కంభం (10:13/10:15), మార్కాపురం (10:32/10:33), దొనకొండ (10:55/10:57), నరసరావుపేట (12:15/12:17), గుంటూరు (13:15/13:20), విజయవాడ (14:10/14:20), గుడివాడ (15:03/15:05) దాటుకుని మధ్యాహ్నం 15:55 గంటలకు మచిలీపట్నం స్టేషన్కు చేరుకుంటుంది.
{{/usCountry}}కోస్తా ఆంధ్ర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు శివార్లలోని యలహంక వరకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది.