పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని తిన్‌సుకియా-కర్ణాటకలోని ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, విజయవాడ, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

ఈ ప్రత్యేక సర్వీసులు మొత్తం 6 ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ కింద పేర్కొన్న సమయాలు, స్టేషన్ల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.
తిన్‌సుకియా – ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు (ట్రైన్ నంబర్: 05952)
అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 12, 2026 వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు తిన్‌సుకియాలో బయలుదేరుతుంది. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు దువ్వాడ చేరుకుని, 3.25 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 09.30 గంటలకు ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు చేరుకుంటుంది. మొత్తం ట్రిప్పులు 6 ట్రిప్పులు నడుస్తుంది.
ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు – తిన్‌సుకియా (ట్రైన్ నంబర్: 05951)
అక్టోబర్ 12, 2026 నుండి నవంబర్ 16, 2026 వరకు ఈ సర్వీస్ నడుస్తుంది. ప్రతి సోమవారం అర్ధరాత్రి దాటాక (తొలిజామున) 12.05 గంటలకు ఎస్‌ఎమ్‌విటి బెంగళూరులో బయలుదేరుతుంది. సోమవారం రాత్రి 9.15 గంటలకు దువ్వాడ చేరుకుని, 9.20 గంటలకు బయలుదేరుతుంది. బుధవారం సాయంత్రం 4.25 గంటలకు తిన్‌సుకియా చేరుకుంటుంది. మొత్తం 6 ట్రిప్పులు నడుస్తుంది.
ఈ రైళ్లు దిబ్రూగఢ్, ధెమాజీ, నార్త్ లఖింపూర్, హర్ముటి, విశ్వనాథ్ చరాలీ, రంగపారా నార్త్, రంగియా, బర్పెట రోడ్, న్యూ కోక్రాఝర్, న్యూ కూచ్ బెహార్, అలువాబరి, కిషన్ గంజ్, న్యూ ఫరక్కా, రామ్ పూర్ హట్, బోల్ పూర్ శాంతినికేతన్, బర్ధమాన్, డంకుణి, అందూల్, ఖరగ్ పూర్, భద్రక్, జాజ్ పూర్ కియొంఝర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బలుగావ్, బ్రహ్మపూర్ మీదుగా నడుస్తుంది. ఏపీలో పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్, కృష్ణరాజపురంలో ఆగుతాయి.
{{/usCountry}}ఈ రైళ్లు దిబ్రూగఢ్, ధెమాజీ, నార్త్ లఖింపూర్, హర్ముటి, విశ్వనాథ్ చరాలీ, రంగపారా నార్త్, రంగియా, బర్పెట రోడ్, న్యూ కోక్రాఝర్, న్యూ కూచ్ బెహార్, అలువాబరి, కిషన్ గంజ్, న్యూ ఫరక్కా, రామ్ పూర్ హట్, బోల్ పూర్ శాంతినికేతన్, బర్ధమాన్, డంకుణి, అందూల్, ఖరగ్ పూర్, భద్రక్, జాజ్ పూర్ కియొంఝర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బలుగావ్, బ్రహ్మపూర్ మీదుగా నడుస్తుంది. ఏపీలో పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్, కృష్ణరాజపురంలో ఆగుతాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక కోచ్‌లను కేటాయించారు. రైలు టికెట్ల రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా బెర్తులను బుక్ చేసుకోవచ్చు.