పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గుంటూరు - కోల్‌కతా చిత్పూర్ - గుంటూరు (07437/07438) మధ్య ప్రత్యేక 'స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్' రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 2 ట్రిప్పుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ సర్వీసుల పూర్తి వివరాలు, సమయాలు, ఆగే స్టేషన్లు, కోచ్‌ల సమాచారం చూడండి.

రైలు నంబర్ 07437 (గుంటూరు – కోల్‌కతా చిత్పూర్ స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్) రైలు గుంటూరు నుంచి బయలుదేరి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(చిత్పూర్)కు చేరుకుంటుంది. 25.10.2026, 01.11.2026 (మొత్తం 2 ట్రిప్పులు) నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుండి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10:20 గంటలకు దువ్వాడ చేరుకుని, రాత్రి 10:22 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కోల్‌కతా చిత్పూర్ చేరుకుంటుంది.
రైలు నంబర్ 07438 (కోల్‌కతా చిత్పూర్ – గుంటూరు స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్) తిరుగు ప్రయాణంలో ఈ రైలు కోల్‌కతా చిత్పూర్ నుండి గుంటూరుకు చేరుకుంటుంది. 26.10.2026, 02.11.2026 (మొత్తం 2 ట్రిప్పులు) నడుస్తుంది. సోమవారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు దువ్వాడ చేరుకుని, 10:32 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) సాయంత్రం 5:30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్, అందూల్, దంకునిలో ట్రైన్స్ ఆగుతాయి.
ఈ ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 19 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. సెకండ్ ఏసీ 1 కోచ్, థర్డ్ ఏసీ 2 కోచ్‌లు , స్లీపర్ క్లాస్ 6 కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్ 8 కోచ్‌లు ఉంటాయి. అంతేకాదు సెకండ్ క్లాస్ విత్ బ్రేక్ వ్యాన్ అండ్ లగేజ్ కోచ్‌లు 2 ఉన్నాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 19 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. సెకండ్ ఏసీ 1 కోచ్, థర్డ్ ఏసీ 2 కోచ్‌లు , స్లీపర్ క్లాస్ 6 కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్ 8 కోచ్‌లు ఉంటాయి. అంతేకాదు సెకండ్ క్లాస్ విత్ బ్రేక్ వ్యాన్ అండ్ లగేజ్ కోచ్‌లు 2 ఉన్నాయి.
{{/usCountry}}పండుగల సీజన్లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు రైళ్లలో ఎదుర్కొనే రద్దీని నివారించేందుకు దక్షిణ కోస్తా రైల్వే ఈ ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా, అలాగే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.