రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇంకా 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈనెల 17 నుంచి ప్రారంభం….
ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 26వ తేదీ వరకు ఈ క్యాంపుల ద్వారా సేవలను పొందవచ్చు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు వారి కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి వీరంతా వారి పాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక పిల్లల ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిగా ఉచితమని, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
- చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి.
- పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.
- చిన్నారులను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి.
- ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.
బాల్యంలో ఆధార్ తయారు జారీ చేసేటప్పుడు… పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అభివృద్ధి చెందదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}బాల్యంలో ఆధార్ తయారు జారీ చేసేటప్పుడు… పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అభివృద్ధి చెందదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}