Special Trains : పార్వతీపురం - ఏక్తా నగర్ మధ్య స్పెషల్ రైళ్లు… వయా విజయవాడ, సికింద్రాబాద్! తేదీలివే

పండుగ రద్దీని తగ్గించేందుకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, ఏక్తా నగర్ మధ్య ఆన్-డిమాండ్ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Oct 26, 2026, 06:02:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి….. వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పార్వతీపురం - ఏక్తా నగర్ (గుజరాత్) స్టేషన్ల మధ్య ప్రత్యేక ఆన్-డిమాండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

రైలు నంబర్ 08519 (పార్వతీపురం నుంచి ఏక్తా నగర్) :

ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 28న (బుధవారం) మధ్యాహ్నం 15:00 గంటలకు పార్వతీపురంలో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 16:50 గంటలకు విజయనగరం చేరుకుని, 17:00 గంటలకు ముందుకు సాగుతుంది. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు ఈ రైలు ఏక్తా నగర్ చేరుకుంటుంది.

రైలు నంబర్ 08520 (ఏక్తా నగర్ నుంచి పార్వతీపురం) :

తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 01న (ఆదివారం) రాత్రి 23:30 గంటలకు ఏక్తా నగర్‌లో బయలుదేరుతుంది. నవంబర్ 03వ తేదీ మధ్యాహ్నం 14:45 గంటలకు విజయనగరం చేరుకుని 14:50 కి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:00 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.

ముఖ్యమైన స్టాప్‌లు (ఆగే స్టేషన్లు):

పార్వతీపురం, ఏక్తా నగర్ మధ్య రెండు వైపులా ఈ రైళ్లు…. పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, వాడి, సోలాపూర్, పుణే, లోనావాలా, కల్యాణ్ , వసాయ్ రోడ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.

మొత్తం 22 బోగీలతో నడిచే ఈ ప్రత్యేక రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు సీట్లు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. పండుగ ప్రయాణ రద్దీని అధిగమించేందుకు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ఉపయోగించుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More